చిర‌కాల స్నేహితుడు ఆ కుటుంబాన్ని కాద‌నుకుని వ‌చ్చేశాడు. ఆయ‌నే కేవీపీ. వైఎస్ ఆత్మ అని అంటారు. కానీ ఆయ‌న ఆ మాట ఒప్పుకోడు. ఇదంతా మీడియా సృష్టే అని తాను ఏనాడూ అలా చెప్పుకున్న‌దేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు కూడా! ఇప్పుడు చంద్ర‌బాబు వ్యూహంలో కేవీపీ చిక్కుకోనున్నారా?


రాజ‌కీయంలో ఏమ‌యినా జ‌ర‌గ‌వ‌చ్చు. త‌ప్పొప్పులు అన్న‌వి ఇక్క‌డ ఉండ‌వు.కేవ‌లం అవ‌స‌రాలే మ‌నుషుల‌ను ముందుకు న‌డిపి స్తాయి. స్వార్థాలే ఇదివ‌ర‌కు చేయ‌ని త‌ప్పులేవో చేయనిస్తాయి. ఈ క్ర‌మంలో అన్నీ మారిపోతాయి. స‌మీక‌ర‌ణ‌లకు అనుగుణంగా నేత‌లు ఒక‌రినొక‌రు ఆత్మీయ ఆలింగ‌నాలు చేసుకుంటారు. కౌగిలించుకున్నాక కొన్ని మాటలు చెప్పి మోస‌గిస్తారు. మొన్న మా ఎన్నిక‌లు జరిగాయి చూడండి అలా అన్న మాట! ఏదేమ‌యినా గెలుపు అన్న‌ది అంతిమం కావాలి. అందుకు ఏమ‌యినా చేశాక చ‌రిత్ర‌ను తిర‌గ రాసే ప్ర‌య‌త్న‌మొక‌టి చేయాలి. చొర‌వ చూపాలి.  ఇప్పుడు రాజ‌కీయం జ‌గ‌న్ చుట్టూ తిరుగుతోంది. చంద్ర‌బాబుకు అధికారం లేని కార‌ణంగా కొత్త వాళ్ల‌నో పాత వారినో తెర‌పైకి తెస్తున్నాడు. ఆ క్ర‌మంలో కేవీపీ తెర‌పైకి వ‌స్తున్నాడు. ఆయ‌న‌తోనే ప్రచారం చేయించాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. అదే గ‌నుక జ‌రిగే అవ‌కాశం ఉంటే ఇక కేవీపీ పై జ‌గ‌న్ ఏం మాట్లాడ‌తారో అన్న‌ది కూడా ఆస‌క్తిదాయ‌కంగా మార‌నుంది.



ఇంకా చెప్పాలంటే..
సుదీర్ఘ కాలం చంద్ర‌బాబు పై వైఎస్ పెత్త‌నం చేశాడు. పై చేయి సాధించాడు. త‌రువాత కాలంలో జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబుపై పెత్త‌నం చేశాడు. మంచి ఫ‌లితాలే సాధించాడు. సొంతం అనుకునే వారికే చెందిన మీడియా సంస్థ‌లు ఉన్నా కూడా పెద్ద‌గా అనుకున్న‌వేవీ సాధించ‌లేక‌పోయాడు బాబు. ఇప్పుడు త‌న పాత పంథానొక‌టి తెర‌పైకి తెచ్చి, ఉండ‌వ‌ల్లితోనూ, కేవీపీతోనూ రాజ‌కీయం నెర‌పాల న్నది ఆయ‌న ఆశ‌. ఉండ‌వ‌ల్లి నేరుగా రాడు కానీ కేవీపీతో అయినా ప్ర‌చారం చేయించాల‌ని యోచ‌న‌. వాస్త‌వానికి కేవీపీని ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్ విభేదిస్తున్నాడు. అదే ఇప్పుడు బాబుకు క‌లిసి రానుంది. వైఎస్ చ‌నిపోయాక జ‌గ‌న్ త‌న దారి తాను చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీని వీడిపోవ‌డం అంత మంచి ప‌రిణామం కాద‌నే చెప్పారు కేవీపీ ఓ సంద‌ర్భంలో! జ‌గ‌న్ అనే వ్య‌క్తి కాంగ్రెస్ సీఎం అయితే తానెంతో సంతోషించేవాణ్ని అని కూడా అన్నారు. ఇప్పుడు పాత కోపాలేవీ లేవ‌ని చెబుతూనే జ‌గ‌న్ పాల‌న‌పై కొన్ని స్ప‌ష్ట‌మ‌యిన విమ‌ర్శ‌లు కూడా చేశారు ఓ సంద‌ర్భంలో! వైఎస్ లానే ముందూ వెనుకా చూసుకోకుండా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం భావ్యం కాద‌న్న‌ది కేవీపీ భావ‌న‌. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేవీపీతో జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం
చేయించాల‌ని యోచిస్తున్నారు బాబు.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp