తెలంగాణ లో బీజేపీ బలపడుతుంది అనడానికి దుబ్బాక లో జరిగిన పరిణామమే ఓ ఉదాహరణ.. అక్కడ అధికార పార్టీ టీ ఆర్ ఎస్ ని మేడలువంచి మరీ బీజేపీ గెలిచింది.. ఈ గెలుపుతో బీజేపీ లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పొచ్చు.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టి బీజేపీ పార్టీ ఇక్కడ కూడా పాతుకు పోవాలని చూస్తుంది. అందుకోసం ప్రణాళికలను రచిస్తూ ప్రజలోకి దూసుకుపోతుంది అయితే ఇక్కడ బీజేపీ గెలవడం అంత వీజీ కాదని తెలుస్తుంది.. ఆ విషయం బీజేపీ కూడా తెలుసు కానీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అయితే గ్రేటర్ ఎన్నికలకు, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఓ సరైన పేరున్న లీడర్ ఉంటె ఇంకా లాభిస్తుంది అని ఆలోచిస్తున్నారట..