తెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి. గతంలో కేసీఆర్ ఆధిపత్యంతో ఏ లీడర్ వాయిస్ కూడా పెద్దగా వినిపించేది కాదు. తెలంగాణ వచ్చిన నాటినుండి మొన్నటి దుబ్బాక ఎన్నికల ముందు వరకు కేసీఆర్ చేసిందే శాశనం గా తయారైంది.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. దుబ్బాక లో ఓడిపోయి నిరాశలో ఉన్న కేసీఆర్ కి గ్రేటర్ లో వచ్చిన ఫలితాలు పుండుమీద కారణం చాలినంత పనయ్యింది.