సాధారణంగా ప్రపంచంలో కొన్ని వింతలు చూస్తుంటే ఇది నిజమా..వైష్ణవ మాయా అనిపిస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఎన్నో కొత్త వింతలు విశేషాలు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. సాధారణంగా కవల పిల్లలు ఒకే రూపంలో పుట్టడం చూస్తుంటాం. అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వారు అల్లరి చేయడం కొట్టుకోవడం చూస్తుంటాం. నాకు అది కావాలంటే..నాకూ అదే కావాలని మారాం చేస్తూ ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే వారిని ముద్దు చేసి వారి గొడవ సర్ధుమణిగేలా చూస్తుంటాం.
అయితే ఇది బాహ్య ప్రపంచంలో జరుగుతున్న దృశ్యం..మరి కడుపులోనే ఇద్దరు కవలలు కొట్టుకుంటే..ఈ వింత చూడటానికి కళ్లు సరిపోవడం లేదు. పుట్టకముందే పిల్లలు పొట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? తల్లి కడుపులోనే ఇద్దరు కవలలు కొట్టేసుకున్నారు. కవలలు ఒకరిమీద ఒకరు పంచ్ విసురుకున్నారు. అదేంటీ కడుపులో పిల్లలు పంచ్ లు వేసుకోవడం ఏంటా అనుకుంటున్నారా..మీరే కాదు.. ఆల్ట్రా స్కానింగ్ తీసిన డాక్టర్లు కూడా అదే అనుకున్నారు. పంచ్ లు విసురుకుంటున్న కవలలను చూసి షాక్ అయ్యారు.
మహాభారతంలో అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో గురించి విరిస్తుంటే కడుపు లో అభిమన్యుడు వినడం గురించి మనకు తెలిసిన కథే. అయితే తల్లి కడుపులో హాయిగా నిద్రపోతున్న కవలలు.. ఎదురెదురుగా చేతులు ముడుచుకుని ఉండటాన్ని వైద్యులు చూసి ఆశ్చర్యపోయారు.
ప్రతి 30 మిలియన్ల కేసుల్లో ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు. అయితే ఈ కవలలు ఇద్దరూ ఆడపిల్లలు కావడం మరో విశేషం. ఈ స్కానింగ్ చేసిన నాలుగు నెలల తర్వాత చైనాలోని యుంచువాన్ ఆస్పత్రిలో ఈ కవలలు ఆరోగ్యంగా జన్మించారు. పుట్టిన ఇద్దరి బేబీలను పేరంట్స్.. చెర్రీ, స్ట్రాబెర్రీ నిక్ నేమ్ లతో ముద్గుగా పిలుకుంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
brawling
baby twins
appear to punch each other
mum's womb
ap political updates
telangana politics
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national newsandhra pradesh politics
andhra politics
telugu political news
apherald news
apherald politics news
latest politics news
politics
latest news
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి