ప్రస్తుతం రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది గాయపడడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం.. ఓవర్ స్పీడ్ గా వెళ్లడం వల్ల.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి. కొన్నిసార్లు బయటకు వెళ్తున్నప్పుడు వెనుక ఉన్న వాళ్ళు చేసే వ్యక్తులు చేస్తున్న వెక్కిలి చేష్టల కారణంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక బైక్ పై నుండి పడ్డాం అంటే మాత్రం నడ్డివిరగాల్సిందే మరి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా లేదా ఇతర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే బైక్ పై వెళ్తున్న అప్పుడు వర్షం వచ్చింది అనుకొండి... బైక్ డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది.
అంతేకాకుండా రోడ్డు కూడా బాగా స్కిడ్ అవుతూ ఉంటుంది. దీంతో సడన్ బ్రేక్ లాంటివి వేసిన బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు ప్రమాదం జరుగుతుంది. అందుకే వర్షం పడుతున్నప్పుడు బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఆచితూచి బైక్ నడుపుతూ ఉంటారు. కొంతమంది వర్షం వస్తున్నప్పుడు వర్షం పడకుండా ఏదైనా అడ్డు పెట్టుకుని బైక్ నడుపుతూ ఉంటారు. మరికొంతమంది బైక్ నడిపే వాళ్ళు వర్షం పడే టప్పుడు బైక్ మీద వెళ్ళడం ఎందుకులే వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అనుకొని పక్కకు బైక్ ఆపి వర్షం తగ్గేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే బైక్ వెళ్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఎండ వానల నుంచి రక్షించుకోవడానికి గొడుగు తీసుకెళ్తున్నారు. కొంతమంది బైక్ గెలిచినప్పుడు గొడుగు తెరవడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురవుతు ఉంటారు. కానీ ఇక్కడో మహిళ అలాంటిదే చేసింది .. బైక్ స్పీడ్ గా వెళ్తున్న సమయంలో ఎండ ఎక్కువగా ఉందని గొడుగును తెరిచిచింది ఇక అంతే ఢమాల్ అని కిందపడిపోయింది ఇక్కడ ఓ మహిళ.
మామూలుగా చాలామంది బైక్ పై వెళ్తున్నప్పుడు ఎండ నుంచి రక్షణ కోసం గొడుగు తీసుకెళ్తూ ఉంటారు . ఇక్కడో మహిళ అలాగే గొడుగు తీసుకెళ్ళింది. ఇక బైక్ స్పీడ్ గా వెళ్తున్న సమయంలో ఎండ కాస్త ఎక్కువగా ఉందని ఆ గొడుగు ఒక్కసారిగా తెరిసింది ఆ మహిళ... అయితే బైక్ స్పీడ్ మీద ఉండటం తో గాలి బాగా వీచి గొడుగు ఆమెను వెనక్కి లాగింది . దీంతో ఒక్కసారిగా ఆ మహిళా బైక్ పై నుంచి కింద పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆ మహిళ వద్దకు చేరుకుని ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైక్ పై వెళ్లేటప్పుడు గొడుగులను వినియోగించరాదు అంటూ సోషల్ మీడియాలో తెలిపారు సీపీ మహేష్ భగవత్. మీరు మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేయకండి సుమీ !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి