సీఎం జగన్‌ని చంద్రబాబు ఎంత నెగిటివ్ చేయాలనుకుంటున్నారో...అంతకంటే ఎక్కువగా ఆయనకు పాజిటివ్ పెరుగుతుంది.  అసలు జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు...ఈ 8 నెలల్లో ఎంత విష ప్రచారం చేయాలో అంత చేశారు. కానీ బాబు ఎంత చేసిన అది సక్సెస్ కాలేదు. అన్నిటిల్లోనూ విఫలమయ్యారు. ఇక గత రెండు నెలలుగా బాబు అమరావతి అంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.

 

రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ దెబ్బ తింటుందో అని అమరావతి రాజధానిగా ఉండాలని తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ఈయన చేస్తున్న ప్రచారం వల్ల కావొచ్చు, కాస్త అమరావతికి ప్రాధాన్యత ఉండదని అంశం కావొచ్చు..రాష్ట్రం మొత్తం జగన్ నిర్ణయానికి ఎక్కువగానే అనుకూలంగా ఉన్న, అమరావతికి పక్కనే ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలు కాస్త వ్యతిరేకిత వ్యక్తపరిచాయి.

 

రెండు జిల్లాలు వారు ఎక్కువగా అమరావతినే రాజధానిగా ఉండాలనే డిమాండ్ చేశారు. ఇక టీడీపీ నేతలు కూడా రెచ్చగొట్టడంతో వైసీపీకి వ్యతిరేకిత వచ్చింది. ఒకానొక దశలో వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై కాస్త భయపడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ విధంగా రెండు జిల్లాల్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వస్తున్నాయనే నేపథ్యంలో ఊహించని నిర్ణయం మొత్తం మలుపు తిరిగింది. జగన్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం స్పందించాలని టీడీపీతో సహ పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని పలుమార్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటనలు చేశారు. అయినా ప్రతిపక్షాలు జి‌వి‌ఎల్ ప్రకటనలు పట్టించుకోలేదు. అయితే తాజాగా స్వయంగా లోక్ సభలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి రాజధాని విషయంలో కేంద్రం పట్టించుకొదని, రాజధాని ఏర్పాటు చేసుకునే నిర్ణయం రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని తేల్చేయడంతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక ఇదే నిర్ణయంతో కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. అయ్యేది ఏదో అవుతుంది. సీఎం ఎలాగో అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు.

 

పైగా రెండు జిల్లాలు అభివృద్ధిలో ముందున్నాయి. గుంటూరు, విజయవాడ నగరాలు మరింత అభివృద్ధి అయ్యే అవకాశముంది. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకుని రెండు జిల్లాల వారు వైసీపీ ప్రభుత్వం పట్ల పాజిటివ్‌గా వచ్చేశారు. మొత్తానికి జగన్ అదృష్టం అయి ఉండొచ్చు...స్థానిక సంస్థల ఎన్నికల ముందే రెండు జిల్లాల్లో మార్పు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: