శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయడానికి టీటీడీ ఆన్ లైన్ సౌకర్యం కూడా కల్పించింది. అయితే దీన్ని కొందరు అక్రమార్కులు సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు. నకిలీ వెబ్ సైట్లతో భక్తుల జేబులు గుల్ల చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్ సైట్లపై చర్యలు మొదలుపెట్టింది టీటీడీ. 

 

శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ సర్వదర్శనం క్యూ లైను, నడకదారి భక్తులు క్యూ లైను, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైనులు ఏర్పాటు చేసింది. విటితో పాటు నిర్దేశించిన సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవా టిక్కెట్లును కలిగిన భక్తులును, వయోవృద్ధులు, వికలాంగులను, చంటి బిడ్డల తల్లతండ్రులును ప్రత్యేకంగా దర్శనానికి అనుమతిస్తుంది. శ్రీవారి ఆలయంలో రోజుకి 80 వేల నుంచి లక్ష మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించే అవకాశం వుండగా.... అంతకు మించి భక్తులు వస్తుండటంతో.. భారీ క్యూలు తప్పడం లేదు. దీంతో 2014 అక్టోబర్ లో ప్రయోగాత్మకంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లును ఆన్ లైన్ లో భక్తులుకు విక్రయించడం ప్రారంభించింది టిటిడి. టిక్కెట్టు కోనుగోలు చేసిన భక్తుడు నిర్దేశించిన సమయానికి క్యూ లైను వద్దకు చేరుకుంటే రెండు గంటల్లో స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేసింది. గంటల తరబడి క్యూ లైనులో వేచివుండే అవసరం లేకూండా సులభంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో.. దీనికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది.

 

భక్తులు ఆన్ లైన్ సౌకర్యం ఎక్కువగా ఉపయోగించుకోవడంతో.. అక్రమార్కుల కన్ను పడింది. టీటీడీ అధికారికంగా tirupati balaji. Ap. govt. in మరియు  ttdsevaonline. Com వైబ్ సైట్లును నిర్వహిస్తుండగా ..... అక్రమార్కులు కుప్పలు తెప్పలుగా నకీలి వైబ్ సైట్లు తెరిచి.. భక్తుల్ని ముంచేస్తున్నారు. కొన్ని వైబ్ సైట్లు దర్శనం టిక్కెట్లను అదనపు డబ్బులుతో అమ్ముతుంటే.. మరికొన్ని వెబ్ సైట్లు ఫేక్ టికెట్లు ఇచ్చి భక్తుల్ని మోసం చేస్తున్నాయి.  నకిలీ వెబ్ సైట్లపై భక్తుల నుంచి ఫిర్యాదులతో.. టీటీడీ విజిలెన్స్ వీటిపై దృష్టి పెట్టింది. గత ఏడాది 15.....ఈ ఏడాది మరో 20 వైబ్ సైట్లును గుర్తించిన విజిలేన్స్ అధికారులు.... వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. అధికారిక వెబ్ సైట్ల ద్వారానే టికెట్లు కొనాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. 

 

మరో వైపు నకిలీ వెబ్ సైట్లకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేస్తోంది టీటీడీ. చేస్తూంది. దీంతో విజిలెన్స్ తో పాటు ఐటీ అధికారులు కూడా వీటిపై దృష్టి సారించే అవకాశం ఉంది.  

  

మరింత సమాచారం తెలుసుకోండి: