తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఈరోజు నిర్వహించిన ధర్నాలు ర్యాలీలతో బెజవాడ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వస్తోంది. గతంలో ఉన్న పెన్షన్ నిబంధనలను సైతం సైతం సడలించి మరికొంత మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. అంతేకాకుండా గతంలో ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్ద కే పెన్షన్ అందేలా వైసీపీ ప్రభుత్వం ఈ నెల నుంచి చర్యలుప్రారంభించింది. తాజాగా ఇదే విషయమై వైసిపి టిడిపి ధర్నా నిర్వహించాయి. 


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 7 లక్షల మందికి పెన్షన్లు రద్దు చేసింది అంటూ ఆరోపణలు చేస్తూ టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది.
 విజయవాడలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించారు. అయితే దీంట్లో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో టీడీపీకి పోటీగా భారీ ర్యాలీ నిర్వహించారు. 


వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని, ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో జీర్ణించుకోలేక టిడిపి అనవసర రాద్ధాంతం చేస్తూ.. అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ అవినాష్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ధర్నాలకు పిలుపు ఇవ్వడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 '' జగన్ గారి మొదటి సంతకమే మాయ. మాట మార్చి మడమ తిప్పి పెన్షనర్లను మోసం చేశారు. నేను విన్నాను నేను ఉన్నాను అంటూ 3000 పెన్షన్ పక్క అన్న జగన్ గారు నేను వినలేదు .. నేను లేను అంటూ ₹250 మాత్రమే పెంచి అవ్వ తాతలను మోసం చేశారు. 


రాజన్న రాజ్యం లో 60 ఏళ్లకే ఫెన్షన్ 8 నెలలు అయినా 60 ఏళ్లు దాటిన ఒక్కరికి కూడా ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని తలపిస్తోందని, పండుటాకులపై జగన్ గారికి ఎందుకు అంత కక్షో అర్థం కావడం లేదు. ఒకేసారి ఏడు లక్షల పెన్షన్ లు ఎత్తివేశారు.  దివ్యాంగుల పెన్షన్ కూడా తీసేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది. ? ఎత్తివేసిన పెన్షన్లను తిరిగి ఇచ్చే వరకు అవ్వా, తాతలు తరపున ప్రభుత్వంపై టిడిపి పోరాడుతుంది అంటూ లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ లోకేష్ తో పాటు టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: