చంద్రబాబునాయుడులో మార్పు ఆశించటం వృధానే అన్న నిర్ధారణకు నేతలు వచ్చేశారు. ఎందుకంటే మంగళవారం పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి ఓటమికి జనాలదే తప్పని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. జనాలు అప్పుడప్పుడు తప్పులు చేస్తారట. అటువంటి తప్పే మొన్నటి ఎన్నికల్లో వైసిపికి ఓట్లేయటమట.  చంద్రబాబు తాజా కామెంట్లతో అసలు ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏమి మాట్లాడుతున్నాడో కూడా నేతలకు అర్ధం కాలేదు.

 

చంద్రబాబు మాటలను బట్టిచూస్తే ఓటమిపై  విశ్లేషణలో నిజాయితి లేదని తెలిసిపోతోంది.  పార్టీ ఘోర ఓటమికి అవినీతి, విచ్చలవిడితనం, అమరావతి పేరుతో జనాలను మోసం చేయటం, కులప్రీతి పెరిగిపోవటం, పెరిగిపోయిన సామాజికవర్గం ఆధిపత్యం, టిడిపి నేతల ధౌర్జన్యం లాంటివి ప్రధాన  కారణాలు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు కూడా పార్టీ ఓటమికి ప్రధాన కారణమని స్వయంగా పార్టీ ఎంపి కేశినేని నాని లాంటి వాళ్ళు బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

 

అంటే నేతల విశ్లేషణలో నాజాయితి కనిపిస్తోంది కానీ చంద్రబాబు దగ్గర సమస్య వస్తోంది. ఇప్పటికీ తన హయాంలో జరిగిన తప్పిదాల వల్లే జనాలు ఓడగొట్టారని అంగీకరించటానికి ఇష్టపడటం లేదు. అందుకనే వైసిపికి ఓట్లేయటమే జనాలు చేసిన తప్పంటున్నారు.

 

నిజానికి వైసిపికి జనాలు ఓట్లేయటమే తప్పనేంత సాహసానికి పూనుకున్నారంటేనే చంద్రబాబులో మార్పు రాదని, ఆశించటం కూడా వృధానే అని నేతలంతా నిర్ధారణకు వచ్చేశారు.  ఎందుకంటే టిడిపికి ఓట్లేసిన జనాలే వైసిపికి కూడా వేశారన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. చంద్రబాబు ఉద్దేశ్యంలో  తన పాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నా జనాలంతా తనకు మాత్రమే ఓట్లేయాలని ఫిక్సయిపోయారు. అంటే చంద్రబాబులో మానసిక సమస్యలు పీక్స్ కు  చేరుకునేసిందన్న విషయం అర్ధమైపోతోంది.  కాబట్టి ఇటువంటి విస్తృతస్ధాయి సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా ఉపయోగం లేదని నేతలు అనుకుంటున్నారు. మరి ఈ విషయం చంద్రబాబుకు ఎప్పుడు అర్ధమవుతుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: