ప్రజలకు కష్టాలు ప్రభుత్వపరంగా ఏవైనా అవసరాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకుంటారు ..? రాజకీయ నాయకులకు. అలాంటి రాజకీయ నాయకులకు కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు ...? ఎవరో అయితే ఇంకెవరికో చెప్పుకునే వారు కానీ చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాత్రం తనకొచ్చిన కొండంత బాధను గూగుల్ తో చెప్పుకుని బావురుమంటున్నాడు. ఇంతకీ లోకేష్ కు వచ్చిన ఆ కొండంత కష్టం వెనుకున్న కథ ఏంటో చూద్దాం. 


చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆ పేరు కంటే పప్పు అంటే ప్రపంచవ్యాప్తంగా జనాలకు బాగా అర్థమవుతుంది. టిడిపి రాజకీయ ప్రత్యర్థులు కూడా అదే పనిగా లోకేష్ ను ఉద్దేశించి పప్పు.. పప్పు అంటూ విమర్శలు చేయడం, జనాలు కూడా దానికి బాగా అలవాటు అయిపోవడంతో లోకేష్ పేరు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ పాపులారిటీ ఆ విధంగా లోకేష్ కు ఇబ్బందికరంగా మారింది. గూగుల్ లో కూడా పప్పు అని పేరు కొట్టగానే లోకేష్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. టిడిపి రాజకీయ ప్రత్యర్ధులు సోషల్ మీడియాలోనూ లోకేషన్ ఉద్దేశించి పప్పు పప్పు అంటూ పదేపదే కామెంట్స్ చేయడంతో గూగుల్ లోనూ పప్పు అనే పదం కొట్టగానే లోకేష్ సంబంధించిన వివిధ రకాల ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ఇప్పుడు లోకేష్ పప్పు అనే పదంపైన దృష్టి పెట్టారు.


 ఇక ఈ విషయాన్ని ఇలా వదిలి పెట్టేస్తే.. భవిష్యత్తులో తనకు, తన రాజకీయ ఎదుగుదలకు ఈ పదం చాలా ఇబ్బందికరంగా మారుతుందని భావించిన ఆయన దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా గూగుల్ సంస్థను కోరినట్లు తెలుస్తోంది. స్వయంగా లోకేష్ గూగుల్ లో పప్పు అని కొట్టగా తన పేరు రావడం తీవ్రంగా అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలోనూ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ గూగుల్ మొరపెట్టుకున్నా ఫలితం కనపడకపోవడం తో.. మరోసారి దీనిపై గూగుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.


 ఈ వ్యవహారం తనకు చాలా ఇబ్బందికరంగా మారడంతో ఆ పదాన్ని తొలగించాలని గూగుల్ లో పప్పు అని కొట్టగానే తన ఫోటోలు, పేరు రాకుండా చూడాలంటూ గూగుల్ కు లోకేష్ మొరపెట్టుకోవడానికి కారణంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పప్పు, ఏపీ పప్పు ఇలా పప్పు పప్పు అనే ఏ పేరు కొట్టినా లోకేష్ ఫోటోలు రావడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తుండడం ఆయనను ఒక కామెడీ పీస్ గా జనాలు చూస్తుండడంతో లోకేష్ ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ  మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: