రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. మహిళలు ఎక్కడికి వెళ్ళినా రక్షణ కరువై కామపు కోరల్లో చిక్కుకొని బలైపోతున్నారు. ఆత్మగౌరవం కోసం ఉద్యోగం చేద్దామని వెళితే అక్కడ లైంగిక వేధింపులు తప్పడం లేదు మహిళలకు. చదువుకునేందుకు స్కూల్ కి వెళ్ళిన... ఉద్యోగం చేసేందుకు ఆఫీస్ కి వెళ్ళినా... ఇంటికి వెళ్లిన ప్రతిచోట మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి.ఎన్ని  కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామందుల తీరులో  మాత్రం మార్పు రావడం లేదు. రెచ్చిపోయి మరి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగగా తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. 

 

 

 నగ్నంగా డ్యాన్స్ చేయాలా అంటూ ఓ మహిళ ఈవెంట్ ఆర్గనైజర్ నలుగురు యువకులు వేధించారు.ఆమె  పై దాడి చేసీ  గదిలో బంధించారు. రాత్రంతా నరకం అనుభవించిన బాధితులు... ఆ దుర్మార్గుల బారినుండి తప్పించుకొని... భర్త సాయంతో పోలీసులని ఆశ్రయించింది.  హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ ఈవెంట్ ఆర్గనైసర్ గా  పనిచేస్తుంది. పుట్టిన రోజుకు సంబంధించిన ఈవెంట్కి ఏర్పాట్లు చేయాలి అంటూ అమీర్ అనే యువకుడు ఇటీవలే సదరు మహిళను సంప్రదించాడు. 22వ తేదీన రాత్రి పుట్టినరోజు  వేడుకలు జరిగాయి. 

 

 

 ఇక  పుట్టిన రోజు వేడుకల్లో . .. ఫుల్లుగా మద్యం సేవించిన అమీర్,  స్నేహితులు... మహిళా ఈవెంట్ ఆర్గనైజర్ ను న్యూడ్ డాన్స్ చేయాలి అంటూ అడిగారు. అయితే ఎందుకు ఆమె నిరాకరించింది... ఎంత చెప్పినప్పటికీ ఆమె మాత్రం న్యూడ్ డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోకపోవడంతో కత్తులతో చంపేస్తామంటూ బెదిరించారు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి గదిలో బంధించారు. ఇక రాత్రంతా వారి చెరలోనే  గదిలో బందీగా ఉన్న బాధితురాలు మరుసటి రోజు ఉదయం... తప్పించుకుని భర్తతో కలిసి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళలపై దాడి చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: