ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో వెరసి ఎన్ని రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, డిసిఎం ఢీకొన్న ఘటనలో... ఏకంగా  ఏడుగురు ప్రాణాలు పోయాయి... మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రులను హుటాహుటిన మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్ర గాయాలపాలైన వారిలో ఆర్టీసీ డ్రైవర్ కూడా ఉండటం గమనార్హం. 

 

 

 

 అయితే మెదక్ లో  డిసిఎం వ్యాన్ లో  ఏడుపాయల దేవస్థానానికి వెళ్లి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా సంగారెడ్డి జిల్లా గ్రామానికి చెందిన ఫసల్ వాడి గ్రామానికి చెందిన వారీగా  పోలీసులు గుర్తించారు. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారిని మెదక్ ఏరియా ఆస్పత్రి నుంచి వెంటనే గాంధీకి 108 వాహనంలో తరలించారు. ఇక రోడ్డు ప్రమాదం కారణంగా పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది . ఆర్టిసి బస్సు డీసీఎం ఢీకొనడంతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓవైపు ఆర్టిసి బస్సు మరోవైపు డీసీఎం వ్యాన్ ల ముందు భాగం మొత్తం ధ్వంసం అయింది. 

 

 

 

 అతివేగం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఎస్పీ చందన దీప్తి సందర్శించి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం పై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి అంటూ  ఆదేశించారు. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో గూడాల మన్నెమ్మ, గూడూరు దుర్గమ్మ, మధురిమ. రజిత ఉండగా మరో ముగ్గురు మృతుల పేర్లు తెలియాల్సి ఉంది. కాగా ఈ రోడ్డు ప్రమాదం తో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: