తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి కరోనా వేగంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 229కు చేరింది. వీరిలో 32 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. 
 
రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. దక్షిణ మధ్య మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 
 
నగరంలో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉంది. మరోవైపు రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు పడితే రైతులు నష్టపోయే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే లాక్ డౌన్ అమలు నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రైతులు వర్షం వల్ల తీవ్రంగా నష్టపోనున్నారు. 
 
మరోవైపు నిన్న ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా పకడ్బంధీగా లాక్ డౌన్ అమలు చేయాలని పోలీసులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీలో నిన్న 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 164కు చేరింది. ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉండటంతో కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: