భారత దేశ వ్యాప్తంగా కరోనా  వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి అంతకంతకూ చేయి దాటిపోతుందని. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రజలందరిలో ప్రాణభయం పట్టుకుంది. ఇదిలా ఉంటే అటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం మాత్రం మరింత ఎక్కువగా జరుగుతోంది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అటు అధికారులు కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ సోకని  వారికి కూడా కరోనా  వైరస్ బారిన పడ్డారు అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా ఓ వ్యక్తిపై ఇలాంటి ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. 

 


 ఇక ఇలా తనకు కరోనా  వైరస్ సోకింది అంటూ  సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరగడంతో అతను తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. గ్రామ పంచాయతీ వద్ద పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేశాడు. చివరికి ఎమ్మెల్యే వచ్చి సర్దిచెప్పడంతో ఆ వ్యక్తి ఊరుకున్నాడు. ముఖ్యంగా సోషల్ వీడియోలు తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని ఆలూరు తాలూకా లోని నిడగట్టహళ్లి  కి చెందిన వ్యక్తి బెంగళూరులోని ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చిన అతడు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. 

 


 ఇక ఈ విషయం వైద్య అధికారులకు తెలియడంతో వైద్య అధికారులు అతనికి హోమ్ క్వారంటైన్  చేశారు. ఇక ఈ విషయాన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది ఆకతాయిలు ఆ వ్యక్తికి కరోనా  వైరస్ సోకింది అంటూ  తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ విషయం తెలిసిన బాధితుడు తనను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పెట్రోల్ సీసాతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నానా హంగామా సృష్టించాడు. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని బాధితుడు... తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. ఇక విషయం తెలిసిన ఎమ్మెల్యే హుటాహుటిన అక్కడికి చేరుకొని... అతనితో మాట్లాడి నచ్చజెప్పి అతడిని హోమ్ క్వారంటైన్ కు  తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: