కరోనా వైరస్ పై యుద్ధంలో డాక్టర్లు హెల్త్ వర్కర్ల పాత్ర ఎంతో కీలకం అని చెప్పాలి. కరోనా వైరస్ పేషంట్ లకు సేవ  చేస్తున్న చాలామంది హెల్త్ వర్కర్స్ కరోనా వైరస్ బారినపడి ప్రాణాలను సైతం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హెల్త్ వర్కర్స్ సంఖ్యను తగ్గించి రోబోట్ల ద్వారా కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేలా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తక్కువ ఖర్చుతో కూడిన రోబోట్లను అభివృద్ధి చేసింది. ఐటిఐ తయారుచేసిన ఈ రోబోట్లు ప్రస్తుతం కరోనా  వైరస్ రోగులకు చికిత్స అందించే విషయంలో ఉపయోగపడతాయి. 2.5 లక్షల వ్యయంతో రోబోట్ ను తయారు చేశారు. 

 

 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో తయారు చేసిన ఈ రోబోట్లు వీల్స్ సాయంతో కదులుతూ ఉంటాయి. మొదటిసారిగా ఈ రోబోట్లను జైపూర్లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్ లో మార్చి 26 2020 వ తేదీన టెస్ట్ చేశారు. ఈ రోబోట్లు కరోనా  వైరస్ రోగులకు ఆహారం నీళ్లు మెడిసిన్స్ అందించడానికి ఉపయోగపడతాయి. రోబోట్  ఉపయోగించడం ద్వారా అటు డాక్టర్లకు హెల్త్ వర్కర్ ను ఎక్కువ మొత్తంలో కరోనా  వైరస్ బారిన పడకుండా ఉంటారు.రోబోట్ ద్వారా చాలా మటుకు కరోనా వైరస్  నియంత్రించవచ్చు అనే చెప్పాలి. ఎందుకంటే హెల్త్ వర్కర్లు కరోనా  వైరస్ పేషంట్లకు  ప ఆహారం అందించడం మెడిసిన్స్ అందించడం చేస్తూ ఉండటం కారణంగా ఏదో ఒక విధంగా హెల్త్ వర్కర్లు  ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోబోట్లు ద్వారా విజయవంతంగా ఈ మహమ్మారి పై పోరాటం చేయడానికి వీలు ఉంటుంది. చాలా మటుకు హెల్త్ వర్కర్ కూడా మహమ్మారి వైరస్ బారిన పడకుండా ఉండేలా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: