విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్లాస్టిక్ తయారీ కంపెనీ అయిన ఎల్జి పాలిమర్స్ నుంచి తెల్లవారుజామున భారీ మొత్తంలో విషవాయువులు లీకే జీ అయ్యి  చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విష వాయువు కారణంగా అస్వస్థతకు గురైన చాలా మంది ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇక ఎంతో మంది మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలను కూడా బలితీసుకుంది ఈ విష వాయువు. చుట్టుపక్కల గ్రామాల్లోని ఎలుకలు పాములు పిల్లులు కుక్కలు అన్ని  విగతజీవులుగా మారిపోయి ఎక్కడికక్కడ నురగలు కక్కుతూ మృత్యువాత పడ్డాయి. 

 

 

 ఇక దాదాపు కొన్ని గ్రామాల ప్రజల ప్రాణాలు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు విశాఖ వాసులకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. జంతువులు క్రిమికీటకాలు ఈ విషవాయువు పీల్చడం ద్వారా... వాటి నుంచి ఎలాంటి బాక్టీరియాలు బయటకి వచ్చాయి  అనేది నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పరీక్షించి నివేదిక వచ్చేంత వరకు స్పష్టత రాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఆయా చుట్టుపక్కల గ్రామాలలో మరణించిన మూగజీవాల యొక్క కళేబరాలను పశు  సంవర్ధక శాఖ సేకరించింది. మొత్తం 34 పశువులు జంతువులు మృతి చెందాయి. 

 

 

 కాగా ప్రస్తుతం గ్రామాల్లో ఈ విష వాయువు ప్రభావాన్ని తగ్గించడానికి నీటిని చల్లుతున్నారు అధికారులు. కాగా ఆయా ప్రాంతాలలో కనిపించని చోట కూడా మరణించిన మూగజీవాల కలేబరాలతో  వెళ్లే నీటి వల్ల కూడా ముప్పు  ఉంటుంది అని  నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ లోపల ట్యాంకులను చల్లబరచడానికి వినియోగిస్తున్న నీటిలో విషం తో కలిసిన రసాయనాలు  వస్తాయని.. కాబట్టి కచ్చితంగా శుద్ధి చేయాల్సిందే అని అంటున్నారు. ఒకవేళ ఈ విష వ్యర్థ జలాలు భూమి లోకి వెళ్ళిన అది ప్రజలకు ముప్పే అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: