ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ రాష్ట్రంలో విడతల వారీగా పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 
 
ఆధికారంలోకి వచ్చిన వెంటనే 2,000 రూపాయల పెన్షన్ ను 2,250 రూపాయలకు పెంచిన జగన్ తాజాగా పెన్షన్ ను మరో 250 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండో విడత కింద జూన్ నెల నుంచి 250 రూపాయలు పెన్షన్ పెందుతున్నట్టు చెప్పారు. జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచుతుండగా జులై నుంచి పెంచిన మొత్తం లబ్ధిదారులకు అందనుందని తెలుస్తోంది. వైయస్సార్ పెన్షన్ కానుక పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 
 
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతరులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇచ్చిన హామీ ప్రకారం జగన్ పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై పెన్షన్ తీసుకునేవారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా జగన్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గత నెలలో సున్నా వడ్డీ, వసతి దీవెన పథకాలను అమలు చేసిన జగన్ ఈ నెలలో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 99 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఏపీకి చెందిన వారు 44 మంది కరోనా భారీన పడగా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 45 మంది కరోనా భారీన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,896కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: