దేశంలో ఎవరిని మొసం చేసినా చేయకపోయినా.. ఆరుగాలం శ్రమించే రైతులను ఈజీగాా మోసం చేయొచ్చని భావిస్తారు కొంతమంది ఘరానా మోసగాళ్ళు.  నిజమే తమకు కష్టపడి పండించి పదిమంది కడుపు నింపడమే వారికి తెలుసు.. ఆ అమాయకత్వాన్ని కొంత మంది ఎరువుల వ్యాపారులు క్యాష్ చేసుకుంటారు.  ఇలాగే ఎంతో మంది రైతులను నకిలీ విత్తనాలు అమ్ముతూ దారుణంగా మోసం చేస్తున్న ఓ ఎరువుల వ్యాపారిని స్వయంగా ఓ మంత్రి  సినీ ఫక్కీలో మారువేషంలో వెళ్లి ఓ ఎరువుల షాపు యజమాని గుట్టు రట్టు చేశాడు. ఆకస్మికంగా తనిఖీలు చేసి ఆయనపై కేసు నమోదు చేయించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఇది జరిగింది. 

 

వ్యవసాయ శాఖ మంత్రి దాదాజి భూసే రైతులకు ఎదురౌతున్న సమస్యలు తెలుసుకోవాలని అనుకున్నాడు. రైతు వేషంలో ఔరంగాబాద్‌లోని ఎరువుల షాపు యజమాని వద్దకు వెళ్లారు. 10 బస్తాల నవభారత్‌  యూరియా కావాలని అడిగారు. అయితే షాపు యజమాని ఎరువుల నిల్వలు ఉన్నప్పటికి లేవని సమాధానం ఇచ్చాడు. స్టాక్‌ రిజిస్టర్‌ చూపించమని అడిగితే ఇంట్లో మర్చిపోయానని చెప్పాడు.

 

ఓ మంత్రినే ఇంత దారుణంగా మోసం చేస్తున్న ఆ షాప్ యజమానిపై ఆగ్రహించిన మంత్రి జిల్లా అధికారులను షాపుపై సోదాలకు ఆదేశించారు. సోదాలు  నిర్వహించిన పోలీసులు 1300 యూరియా బస్తాలను  స్వాధీనం చేసుకున్నారు.  క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు సక్రమంగా పనిచేయాలని, అలా అయితేనే రైతులు ఇబ్బందులు పడరని ఈ సందర్భంగా మంత్రి భూసే అన్నారు.  ఎవరైనా రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: