పోలీసులకు అనుమానం వచ్చి రంగంలోకి దిగి క్షుణ్ణంగా విచారణ చేయడం మొదలుపెట్టారు. భార్య తీరుపై కాస్త అనుమానం వచ్చింది. దీంతో భార్యను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. సుధీర్ అనే వ్యక్తి సర్వే డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అతనికి స్కూల్ టీచర్ అరివుసెల్వం తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. ఒక పాప ఉంది. ఇక అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో సుధీర్ హఠాత్ మరణం అందరినీ షాక్ ఇచ్చింది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో అతని మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు తేలడంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది భార్య .
భర్త ప్రతి రోజూ తాగొచ్చి తీవ్రంగా కొట్టేవాడిని .. తన భర్తకు సెక్స్ పిచ్చి ఎక్కువ అంటూ తెలిపింది. విచ్చలవిడిగా సెక్స్ చేసేందుకు తనను తీవ్రంగా బాధించే వాడిని... భర్త తీరుతో విసిగి పోయిన తాను ఓ రోజు మద్యం తాగి మత్తులోకి జారుకోగానే బంధువులు బాలమణి, సుమేయర్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి