నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్న భార్య చనిపోవడంతో భర్త ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక పోయాడు. భార్య లేకుండా తనకు ఈ లోకంలో అసలు జీవితమే లేదు అనుకొని చివరికి ఆత్మహత్య తీసుకొని బలవన్మరణానికి పాల్పడి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఘటన పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలో చోటుచేసుకుంది, వివరాల్లోకి వెళితే.. బొర్రంపాలెం గ్రామానికి చెందిన చింతలపూడి వెంకటేష్ 26 కి ఉష అనే యువతితో కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కూలి పనులు చేసుకుంటూ వెంకటేష్ కుటుంబపోషణ చూసుకుంటున్నాడు. అయితే మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన వెంకటేష్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే భార్య ఉష పుట్టింటికి వెళ్లగా అక్కడ ఆమె తండ్రి మందలించాడు, దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఉష ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది, దీంతో వెంకటేష్ తీవ్రంగా కుంగిపోయాడు. భార్య దూరమైన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని రోజుల పాటు తీవ్రంగా మనస్తాపం చెందిన వెంకటేష్ చివరికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు, మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు,
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి