దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందిస్తూ నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దేశంలోని అతి ఎక్కువ కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుగా రికార్డు సృష్టించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను ప్రస్తుతం అందిస్తోంది. కేవలం సర్వీసులను అందించడమే కాదు... అందరికీ మేలు జరిగే విధంగా వివిధ స్కీమ్ లను  అందుబాటులోకి తీసుకు వస్తూ రుణాలు అందించేందుకు కూడా సిద్ధపడుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో భాగంగానే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్,  గోల్డ్ లోన్,  వెహికల్ లోన్,  ప్రాపర్టీ లోన్ లాంటివి తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.




 అయితే ఇటీవలే కేవలం ప్రత్యేకంగా రైతుల కోసం ఒక కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ పర్సనల్ గోల్డ్ లోన్ స్కీమ్ కింద రైతులు సులభంగానే రుణం పొందే అవకాశాన్ని కల్పించింది. అంతే కాకుండా అతి తక్కువ వడ్డీ రేటు కే ఈ లోన్ అందించేందుకు నిర్ణయించింది. ఈ స్కీమ్  కేవలం రైతులకు మాత్రమే వర్తిస్తుంది అంటూ నిబంధన విధించింది. అయితే రైతులు తమ బంగారంపై ఓవర్డ్రాఫ్ట్ పొందే  ఫెసిలిటీ కూడా కూడా ఉంది  అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.



 అయితే రైతులు ఇలా లోన్ తీసుకున్న మొత్తాన్ని 12 నెలల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎస్ బి ఐ బ్యాంక్ బ్రాంచ్ లలో ... ఇటీవలె స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చిన గోల్డ్ లోన్ స్కీమ్ కింద సులభంగా ఋణం పొందవచ్చు. అంతేకాకుండా రైతులకు ఇతర ఛార్జీలు ఏమీ ఉండకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గోల్డ్ లోన్ పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.25 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక లోన్ పొందే ప్రాసెస్ కూడా ఎంతో సులభంగా ఉంటుందని స్టేట్ బ్యాంకు తెలిపింది. ఈ అవకాశాన్ని రైతుల సద్వినియోగ పరచుకోవాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: