అయితే రెండేళ్ల కిందట జరిగిన ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించి ఇటీవలే కోర్టు నిందితురాలిని దోషిగా ప్రకటించింది. భార్యే భర్తను చంపేసిన ట్లుగా కోర్టు నిర్ధారించింది. వివరాల్లోకి వెళితే.. కోల్కతా న్యూ టౌన్ కు చెందిన మహిళా న్యాయవాది ఆనిందిత పాల్ తన కంటే చిన్నవాడైన రజత్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల వరకు వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. ఆ తర్వాత భర్త తనకు సరిపడకపోవడంతో ఏకంగా భర్తతో గొడవలు పడటం మొదలు పెట్టింది. చివరికి కఠిన నిర్ణయం తీసుకుని భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ప్లాన్ ప్రకారం భర్త నిద్రిస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ చార్జర్ వైర్ ని మెడకు బిగించి దారుణంగా హత్య చేసింది.
ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లాయర్ ని అరెస్టు చేశారు. కానీ రోజుల వ్యవధిలోనే బెయిల్ పై బయటకు వచ్చింది. కాగా దీనిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అన్ని రకాల సాక్షలను న్యాయస్థానానికి సమర్పించారు. వాటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం ఎట్టకేలకు భార్య అసలు నిందితురాలు అని తెల్చి దోషిగా ప్రకటించింది. భర్త గొంతు బిగించి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో... ప్రస్తుతం భార్యనే దోషిగా ప్రకటిస్తూ శిక్ష విధించింది కోర్టు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి