సినిమాల్లో   విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను భయ పెట్టినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ గొప్ప మనిషిగా నిజమైన హీరోగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు సోను సూద్. ముఖ్యంగా కరోనా  వైరస్ కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా తెర మీదికి వచ్చి ఎంతో మందికి ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు.  వలస కార్మికులకు చేయూతనిస్తూ ఎంతగానో సహాయం అందించాడు. లాక్ డౌన్ సమయంలో వేలాది మందికి సహాయం అందించి రియల్ హీరో గా అవతరించి ఇప్పటికీ తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.



 కష్టంలో ఉన్నాను సహాయం కావాలి అని ఎవరు కోరిన ఎక్కడ వెనకడుగు వేయకుండా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఎంతో మంది ఆశీస్సులు కూడా అందుకుంటున్నాడు సోను సూద్ . ఇప్పటికే ఎంతో మంది ప్రజలకు విద్యార్థులకు కూడా సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. అయితే ఎంతో మందికి సహాయం చేస్తూ అండగా నిలబడి ఆపద్బాంధవుడిగా మారిన సోను సూద్ పై కూడా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. సోను సూద్ చేసే సాయం వెనుక ఏదో ఆలోచన ఉంది అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే... సోను సూద్  ఏదో ఉద్దేశించి సాయం  చేస్తున్నారు అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.



 ఇటీవలే ఓ నెటిజన్ సోను సూద్ సాయం మొత్తం ఫేక్ అంటూ విమర్శించాడు.  ఈ  పోస్ట్ పై స్పందించిన సోను సూద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలె కొత్త ట్విట్టర్ ఎకౌంట్.. ముగ్గురు ఫాలోవర్లు ఉండి వైద్యం కావాలంటూ కోరాడు.  కనీసం సోనుసూద్ ట్యాగ్  చేయక పోయినప్పటికీ ఆ ట్విట్ కీ  సోనుసూద్ రిప్లై ఇవ్వడం ఎలా సాధ్యమైందో తెలియడం లేదు. గతంలో చాలా ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చిన ట్వీట్లు కూడా ఇప్పుడు డిలీట్ అయిపోయాయి అంటూ నెటిజన్ కామెంట్ చేయగా.. అదే గొప్ప విషయం బ్రదర్ ఇబ్బందుల్లో వారిని నేను గుర్తిస్తా వారు నన్ను ఆశ్రయిస్తారు అది చిత్తశుద్ధి కి సంబంధించినది.. నీకు అర్థం కాదు.. పేషంట్  హాస్పిటల్ లో ఉంటాడు. నీకు సాయం చేయాలనిపిస్తే చెయ్యి ఎంతో మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ప్రేమకు ఇద్దరు ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు సోను సూద్.

మరింత సమాచారం తెలుసుకోండి: