ఈ క్రమంలోనే సౌదీఅరేబియా తో కూడా భారత్ ఎంతో బలమైన సంబంధాలు కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ ను కాదని సౌదీ అరేబియా భారత్ తో ఆ పలు రకాల వాణిజ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక రోజు రోజుకు భారత్తో సంబంధాలు కుదుర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపుతుంది సౌదీ అరేబియా. ఈ క్రమంలోనే సౌదీఅరేబియా ఇటీవలే మిత్ర దేశమైన భారత్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా సౌదీ అరేబియా నుంచి భారత్కు నజరానా లాంటిదే అని చెప్పాలి.
క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లలో భారత్ కి భారీ డిస్కౌంట్ ఇచ్చింది సౌదీ అరేబియా. ఇది కీలక పరిణామం అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. గతంలో క్రూడ్ ఆయిల్ విషయంలో ఎక్కడ ధరలు తగ్గించని సౌదీఅరేబియా మొదటిసారి భారత విషయంలో డిస్కౌంట్ ఇచ్చింది. అయితే సోలార్ గ్రిడ్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో మోదీ కీలక పాత్ర వహిస్తున్న నేపథ్యంలో సోలార్ గ్రిడ్ ప్రారంభమైతే క్రూడ్ అయిల్ వాడుకం తగ్గి తద్వారా సౌదీ అరేబియా దేశంకి నష్టం జరిగే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సౌదీ అరేబియా ఇలాంటి నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు,
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి