సాధారణంగా టీనేజీ  లో ఉన్న తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమలు పుట్టడం కామన్ అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు తల్లిదండ్రులు ఏమంటారో  అనే భయం పిల్లల్లో  ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఉండడంతో ప్రస్తుతం చిన్న వయసులోనే ప్రేమ అనే పేరుతో ఎంతో మంది తప్పుదోవ పడుతున్నారు అనే విషయం తెలిసిందే. కొంతమంది యుక్త వయస్సు వచ్చిన తర్వాత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కొంత మంది మాత్రం ఏకంగా  చిన్న వయసులోనే ప్రేమించడం చదువును గాలికి వదిలేసి చెట్టాపట్టాలేసుకుని తిరగటం లాంటివి చేస్తున్నారు. ఇక అంతే కాకుండా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి.




 ఎంతోమంది తమ ప్రేమను ఇంట్లో చెప్పడం ఇష్టం లేక చివరికి పెద్దలకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి తల్లిదండ్రులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది తెలిసీ తెలియని వయసులో ప్రేమించడమే కాదు ఏకంగా తల్లిదండ్రులకు తెలియకుండా క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ఒక జంట. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వెలుగులోకి వచ్చింది. లెక్చరర్ల కళ్ళుగప్పి క్లాస్ రూమ్ లో విద్యార్థులు పెళ్లి చేసుకోవడం కలకలం సృష్టించింది. అయితే క్లాస్ రూమ్ లోనే ఓ విద్యార్థి మరో విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు.



 ఇక వీరిద్దరి పెళ్ళికి మరో విద్యార్థి పెళ్ళి పెద్దగా వ్యవహరించడం గమనార్హం. వివాహానికి సంబంధించిన వీడియో తీయగా ఈ ఘటన నవంబర్ 17వ తేదీన జరిగింది, అయితే విషయం కాస్త కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లడంతో ఇక ఈ ఘటన కాస్త రచ్చరచ్చ అయ్యింది. పెళ్లి చేసుకున్న ఇద్దరికీ కూడా టి సి ఇచ్చి పంపేసింది కాలేజీ యాజమాన్యం. వీరికి సహకరించిన మరో విద్యార్థి పై చర్యలకు ఉపక్రమించింది కాలేజీ యాజమాన్యం. పిల్లలు ఇచ్చిన ఊహించని షాక్ తో తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: