మనకు తెలిసినంత వరకు టీ ని పాలుతో చేస్తారు. లేక అల్లం, గ్రీన్ టీ అని చాల రకాల టీలు ఉంటాయి. వాటిని తాగడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని అందరు అంటుంటారు. అయితే ఓ దేశంలో పక్షి రెట్టలతో కాఫీ తాయారు చేస్తున్నారు. ఇంతకీ ఏం పక్షి అనుకుంటున్నారా. అయితే పక్షి పేరు  జాకు బర్డ్. ఈ పక్షుల వల్ల ఆ కాఫీ ఎస్టేట్‌కు ఎక్కడా లేని పేరు వచ్చేసింది. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే.. 2000 సంవత్సరంలో ఆ కాఫీ ఎస్టేట్ యజమానికి వచ్చిన చిన్న ఆలోచనే ఇది.

ఎస్టేట్ యజమాని హెన్రిక్ స్లోపర్ డి అరాజో ఓ రోజు నిద్రలేచి చూసేసరికి.. జాకు పక్షులు మొత్తం కాఫీ మొక్కలకు వచ్చే గింజలను నాశనం చేస్తూ కనిపించాయి. దీంతో వాటి బెడద ఎలా వదిలించుకోవాలో అతనికి అర్థం కాలేదు. బ్రెజిల్‌లో సంరక్షిస్తున్న పక్షి జాతుల్లో జాకు పక్షి కూడా ఒకటి. దీనివల్ల వాటికి ఎలాంటి హాని తలపెట్టినా ఎస్టేట్ మూసేసుకోవల్సిందే. జాకు పక్షి రెట్టలతో కాఫీ ఎందుకు తయారు చేయకూడదనే ప్రశ్న మదిలో మెదిలింది. పైగా జాకు పక్షులకు ఆ కాఫీ గింజలను చాలా ఇష్టంగా తింటాయి. కాబట్టి.. వాటి మలంలో అవే ఎక్కువగా ఉంటాయని హెన్రిక్ భావించాడు.

కాఫీ ఎస్టేట్‌లో పనిచేసే కూలీలకు ఇకపై కాపీ బీన్స్‌ను కాకుండా.. జాకు పక్షుల రెట్టలను సేకరించాలని చెప్పాడు. ఆ పక్షులకు ఇకపై తమ కాఫీ బీన్స్‌నే ఆహారంగా ఇవ్వాలని తెలిపాడు. ఆ మలాన్నే మనం మార్కెట్లో అమ్మబోతున్నామని చెప్పాడు ఈ మాట విని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. అతడి ఏమైనా పిచ్చా అన్నట్లు చూశారు. యజమాని మాట వినాలి కాబట్టి.. జాకు పక్షుల రెట్టలను కలెక్ట్ చేసి ఆయన ముందు పెట్టారు.

అనంతరం ఆ రెట్టల్లో ఉండే కాఫీ బీన్స్‌ను వేరు చేసి.. వాటిలోని పోషకాలు, రుచికి నష్టం లేకుండా శుభ్రంగా చేశాడు. అనంతరం ఆ గింజలతో కాఫీ తయారు చేసి రుచి చూశాడు. అంతే.. అది రెగ్యులర్ కాఫీ కంటే రుచిగా అనిపించింది. పక్షులు ఆ కాఫీ గింజలను ఆహారంగా తీసుకున్నా.. వాటిలోని పోషకాలను మాత్రం వాటి శరీరం గ్రహించవని హెన్రిక్ తెలుసుకున్నాడు. వాటి కడుపులో విడుదలయ్యే యాసిడ్ల వల్ల ఆ కాఫీ గింజలు రోస్ట్ అవుతాయట. ఫలితంగా వాటికి సాధారణ గింజలు కంటే ఎక్కువ రుచి లభిస్తుందని హెన్రిక్ తెలిపారు. ఈ ఆలోచన వల్ల ఆ ఎస్టేట్ కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీల సరసన నిలిచింది. ఒక కిలో పక్షి రెట్టల ధర వెయ్యి డాలర్లు (రూ.72,659) పలుకుతుందంటే.. ఆ కాఫీకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: