సాధారణంగా రాజకీయాలలో ఎలాగైనా ఏమైనా చేసి అనుకున్న పదవిని సాధించాలనే పిచ్చిలో ఎంతకైనా తెగిస్తుంటారు. గతంలో చాలా రాజకీయ పార్టీలు ఇలా చేయడం చూశాము. ఉదాహరణకు ఎన్నికలలో పోటీ చేసే ఎదుటి అభ్యర్ధులను బెదిరించడం, వారికి డబ్బులు ఆశ చూపి నామినేషన్ లను విత్ డ్రా చేయించడం. కొన్ని సమయాలలో అయితే చంపే వరకూ వెళతారంటే  నమ్మండి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా జోరు మీదున్నాయి. ఎంతలా అంటే ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ అభ్యర్థిని ఎలాగైనా తప్పించి అంటే అధికార పార్టీ వైసీపీ జెండా పాతేలా అన్ని కోణాలలోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

ఒక్కోసారి ఆలోచిస్తే ఇలాంటివి ఎక్కువగా బెంగాల్ మరియు బీహార్ లాంటి రాష్ట్రాలలో మాత్రమే జరుగుతూ ఉండేవి. అప్పట్లో లాలూప్రసాద్ యాదవ్ కూడా ఇలాంటివి చాలానే చేశారు.  ఇటీవలే ముగిసిన పల్లె పోరులో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వైసీపీ పంథాను మార్చుకోవడం లేదు.  కొన్ని రోజులలో జరగబోయే నగర పాలిత ఎన్నికలలో భాగంగా నామినేషన్ ల పర్వం ముగిసిన సంగతి తెలిసిందే. ఎలాగు నామినేషన్ లు వేయడం అయిపోయింది కాబట్టి, వాటిని ఎలాగు తప్పించలేరు...చనిపోయిన 59 మంది అభ్యర్థుల స్థానంలో మాత్రమే తీసుకుంటున్నారు.

అయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో పోటీ చేసే పలాసకు చెందిన 4 టీడీపీ అభ్యర్థులను మంత్రి సీదిరి అప్పలరాజు వైసీపీ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా కాశీ బుగ్గ మున్సిపాలిటీ బీజేపీ కి చెందిన ఇద్దరు అభ్యర్థులను వైసీపీలోకి చేర్చుకోవడం చర్చనీయాంశమైనది. ఇది వైసీపీ వేస్తున్న కొత్త ఎత్తు గడగా పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే మరి కొంతమంది ఇలాంటి ధోరణిని దిగ జారుడు రాజకీయంగా విమర్శిస్తున్నారు.  మరి ముందు ముందు అధికారం కోసం వైసీపీ ఇంకెన్ని రాజకీయ ఎత్తు గడలు వేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: