ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల్లో  అర చేతిలో ఉన్న మొబైల్లో వాలిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో జరిగిన విషయాలను కూడా క్షణాల్లో వ్యవధిలో తెలుసుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్న కొన్ని విషయాలు ఎప్పుడూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.  నిజంగా ఇలా జరుగుతుందా అని నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి ఘటనే  జరిగింది. సాధారణంగా వైద్యులు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆపరేషన్ చేసినట్లుగా ప్రతి ఒక్కరు విని ఉంటారు.



 కానీ నాలుక కు ఆపరేషన్ చేసి కొత్త నాలుకను అతికించారు అని ఎప్పుడైనా విన్నార దాదాపుగా ఎవరూ విని ఉండరు. కానీ ఇటీవలే వైద్యులు ఎంతో కష్టపడి ఏకంగా నాలుకను కత్తిరించి మళ్ళీ కొత్త నాలుక అతికించి సరికొత్త ఆపరేషన్ చేసే విజయవంతమయ్యారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక లోని బెంగుళూరు లో ఈ ఘటన చోటు చేసుకుంది.  కర్ణాటక బెంగలూరులో ఆటో డ్రైవర్ కు వైద్యులు ఎంతో కష్టపడి అరుదైన ఆపరేషన్ చేశారు.   క్యాన్సర్ బారిన పడిన నాలుక స్థానంలో కొత్త నాలుకను అతికించారు.



 దీంతో అతనికి ఎలాంటి ప్రమాదం లేకుండానే చికిత్స తీసుకొని కోలుకుంటున్నాడు. అయితే అసలు కొత్త నాలుక అతికించడం ఎలా కుదురుతుంది. అసలు నాలుక ఎక్కడిది అని అనుమానం మీకు రావచ్చు. అయితే కడుపులోని స్కిన్ సాయంతో కొత్త నాలుకను తయారుచేసే ఇక అమర్చినట్లు గా వైద్యులు తెలిపారు. అయితే ఈ అరుదైన ఆపరేషన్ నిర్వహించడానికి అటు వైద్యనిపుణులు బాగానే కష్టపడ్డారు దాదాపు 10 గంటల పాటు కష్టపడి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం పేషెంట్ ఎంతో క్షేమంగా ఉన్నాడని పదిరోజుల్లో ఆహారం కూడా తీసుకో గలుగుతాడు అంటూ వైద్యులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: