కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే ఈ మాట విన్నప్పుడల్లా పెద్దలు ఏదో సరదాకి చెప్పారు అని అనుకుంటాం.. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం ఇది నిజమే అనిపించక మానదు. కొన్ని కొన్ని సార్లు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కళ్యాణం జరిగిపోతూ ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు ఎంత ఆపడానికి ప్రయత్నించిన జరిగే పెళ్లి జరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూ అందరూ మహమ్మారి వైరస్ తో బెంబేలెత్తిపోతున్న పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు  గత ఏడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఏకంగా సినీ సెలబ్రిటీలు సైతం తమ పెళ్లిళ్లు ఆపకుండా అనుకున్న సమయానికి చేసుకున్నారు.



 అయితే ప్రస్తుతం అందరు ఎక్కడ తమపై కరోనా వైరస్ పంజా విసురుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు.. ఇక్కడ ఒక జంట మాత్రం కరోనా వైరస్ సమయంలో కూడా పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి కుమారుడు తో పాటు అతని తల్లికి కూడా  వైరస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక వారు పెళ్ళి వాయిదా వేసుకుంటారు అని అనుకున్నారు అందరు. కానీ అనుకున్న సమయానికి పెళ్లి జరగాలి అని భావించారు ఇరు కుటుంబాల సభ్యులు. దీంతో ఇక ఆసుపత్రి అధికారులను ఒప్పించి మరీ పెళ్లి జరిపించారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న తర్వాత కరోనా వైరస్ పంజా విసిరింది కానీ ఎక్కడ పెళ్లిని మాత్రం ఆపలేకపోయింది.


 పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న సమయానికి పెళ్లి చేయాలని.. సాంప్రదాయం ప్రకారం పెట్టిన ముహూర్తానికి పెళ్లి చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అని భావించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి సిబ్బంది తో కూడా మాట్లాడారు ఇంకేముంది కరోన వార్డు వారికి ఫంక్షన్ హాల్ గా మారిపోయింది కరోనా రోగులే వారికి బంధువులు అయ్యారు. పీపీఈ కిట్లు పెళ్లి బంధువులుగా మారగా ఇక పట్టుచీరతో పెళ్లి చేసుకోవాల్సిన వధువు కాస్త పి పిఈ  కిట్ ధరించింది. ఇలా పెట్టిన ముహూర్తానికి ఒకటయ్యారు జంట. అయితే ఈ పెళ్లి కాస్త జిల్లావ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: