కేంద్రం లో మోడీ సర్కార్ భారత రక్షణ రంగ వ్యవస్థ ను మరింత పటిష్ట వంతం చేసేందుకు ఈ ఎన్నో కీలక నిర్ణయాలు తీసు కుంటుంది. మొదటి నుంచి అటు డిఆర్డిఓ కి కావలసిన నిధులు కేటాయిస్తోంది. దీంతో డి ఆర్ డి ఓ వినూత్నమైన ఆయుధా లను తయారు చేసే ప్రయోగాలు నిర్వహించి విజయ వంతం అవుతుంది. అయితే ఇక ఆ తర్వాత చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ నేపథ్యం లో చైనా వస్తువు లను బ్యాన్ చేసి మేక్ ఇన్  ఇండియా అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చింది భారత్.


 ఇక ఈ మేకిన్ ఇండియా నినాదం తోనే ముందుకు సాగుతూ భారత్ ఎంతగానో వృద్ధి సాధిస్తోంది. చైనా దిగుమతుల పై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఆయుధాల  విషయం లో కూడా ప్రపంచ దేశాల పై ఆధార పడ కూడదు అని నిర్ణయించుకుంది.  మేకిన్ ఇండియా లో భాగంగా స్వదేశం లోనే ఆయుధాలను తయారు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.  విదేశీ కంపెనీ లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. విదేశీ ఆయుధ తయారీ సంస్థలు భారత్లో తమ కంపెనీ నెలకొల్పి ఆయుధా లను తయారు చేసి ఇవ్వనున్నారు.



ఇలా రక్షణ రంగాన్ని పటిష్ట వంతంగా మార్చేందుకు అటు భారత ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మరి కొన్ని రోజుల్లో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శం గా నిలువనుంది. ఇటీవలే మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మేకిన్ ఇండియా లో భాగం గా సబ్ మెరైన్ ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభమైంది. ప్రాజెక్ట్ 715 అనే పేరుతో 43 వేల కోట్ల రూపాయల ఖర్చుతో సబ్ మెరైన్ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఇది సక్సెస్ అయితే   భారత్ సంచలనమే సృష్టించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: