ఇప్పటికే ప్రజలు కరోనా థర్డ్ వేవ్ రాబోతోందన్న వార్తలతో గజగజ వణుకుతుంటే ఇప్పుడు మరో వైరస్ ఉనికి వార్త ప్రజల నెత్తిపై పిడుగు పడినట్టయింది. తాజాగా మరో వైరస్ వస్తుందని తెలియడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దాని పేరే "నిఫా" వైరస్. అత్యంత ప్రాణాంతకమైన ఈ వైరస్ యొక్క ఆనవాళ్లను  మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో ఉన్నటువంటి గబ్బిలాల్లో గుర్తించినట్లు వెల్లడించారు ప్రముఖ శాస్త్రవేత్తలు. ఆ గుహలోని కొన్ని వ్యాధి సోకిన గబ్బిలాల శాంపుల్స్ ను పరీక్షించగా నిఫా వైరస్ ఉనికి బయటపడిందని పేర్కొన్నారు పరీక్షలు జరిపిన పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రముఖులు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఇదో  వైరస్ అని వెల్లడించారు ఈ పరిశోధనకు సారథ్యం వహించిన పాద్న యాదవ్. 
ఈ వైరస్ కనుక గబ్బిలాల నుండి మనుషులకు సోకితే చాలా డేంజర్ అని, కరోనా వైరస్ కన్నా ఎన్నో రెట్లు ఇది ప్రమాదకరమని వారు అంటున్నారు. అందులోనూ ఈ వైరస్ కి ఎటువంటి మెడిసిన్ అందుబాటులో లేకపోవడం మరో దురదృష్టకరమైన విషయం.  ఈ వైరస్ గతంలో 1998 మలేషియాలో  మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిందని, ఈ వైరస్ ను పందులను పెంచే  రైతుల్లో మొదటిగా గుర్తించడం జరిగింది.  ఈ నిఫా వైరస్ యొక్క లక్షణాలు. జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, వాంతులు, ఆలోచనాశక్తి మందగించడం, శ్వాసకోశ సమస్యలు, కండరాల నొప్పి.
ప్రస్తుతానికి ఈ నిఫా వైరస్ కు  టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. అంతేకాక ఈ వైరస్ సోకిన వారికి ఖచ్చితమైన చికిత్స విధానం కూడా లేకపోవడం చింతించాల్సిన విషయం. ఈ వ్యాధి మొదట గబ్బిలాలు మరియు పందుల నుండి మనుషులకు సోకినట్లు గుర్తించినా, ఆ తర్వాత హ్యూమన్ కి సోకిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చిన ఈ నిఫా వైరస్ మనుషులకు సోకినట్లు అయితే పరిస్థితి ఏంటా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: