ఇందులో వయసుల ఆధారంగా ఇచ్చిన టీకా వివరాలను పీఎం కి వివరించడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరియు ప్రజలకు అందించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమమే కాకుండా, ముందు ముందు ఎక్కువ మందికి వ్యాక్సిన్ ను అందించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ చర్చలో వివరించారు. మరియు ప్రస్తుతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి కూడా ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు తెలియచేశారు. ఈ ఆరు రోజులలో అందించిన టీకాలు, మలేసియా, సౌదీ అరేబియా మరియు కెనడా దేశాలలో ఉన్న జనాభాకి సరిపోతాయని పీఎం కి వివరించి చెప్పారు. వయసులతో పోల్చి చూసుకుంటే దేశంలోని 128 జిల్లాలో ఉన్న 45 సంవత్సరాల వయసుకన్నా ఎక్కువ ఉన్న 50% మంది జనాభాకి టీకా అందించినట్లుగా వీరు తెలియచేశారు. మరియు 16 జిల్లాలో ఉన్న 45 సంవత్సరాల వయసుకన్నా ఎక్కువ ఉన్న 90 % మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు.
అధికారులు చెప్పిన విషయాలన్నిటినీ విన్న పీఎం నరేంద్ర మోదీ వీరి ప్రయత్నాన్ని అభినందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించారు. అంతే కాకుండా ఇంతకు మించి వేగంగా వ్యాక్సినేషన్ ను ప్రజలందరికీ అందించాలని అధికారులు తెలియచేశారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎన్జీఓ లను కూడా కలుపుకుని పోవాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లో కరోనా పరీక్షలను కొనసాగించాలని కేవలం దీని వల్లనే మనము కేసుల సంఖ్యను గుర్తించగలమని ప్రత్యేకంగా తెలిపారు. అన్ని రాష్ట్రాలతో మాట్లాడుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు పీఎం సూచించారు. ఆ సందర్బంగా కోవిన్ పనితీరును పీఎం మోదీకి అధికారులు వివరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి