ప్రస్తుతం భారత్లో కూడా ఇలా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. ముఖ్యంగా చాలా మంది మొదటి డోసు తీసుకున్న తర్వాత ఇక రెండవ రోజు కోసం వేచి చూస్తున్నారు అయితే నిర్ణీత సమయం పూర్తయిన తర్వాత కూడా వ్యాక్సిన్ కొరత కారణంగా రెండో డోస్ వ్యాక్సిన్లు ఇవ్వలేకపోతోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్ లో ఏర్పడిన వ్యాక్సిన్లు కొరత ను ఉద్దేశించి మాట్లాడిన ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులు.. రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య అనంతరం ఎక్కువగా ఉంటేనే ఎంతో ఉపయోగం ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ డోసులు మధ్య గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే.. అంత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటూ వెల్లడించారు. ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని 11 నెలలకు పెంచడం వల్ల మరింత బలమైన ఇమ్యూనిటీపవర్ ఏర్పడినట్లు ఇటీవలే తాము నిర్వహించిన అధ్యయనంలో గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారిపై పరిశోధనలు జరిపీ ఈ విషయాలు వెల్లడించినట్లు చెప్పుకొచ్చారు. రెండు డోసుల మధ్య అంతరాన్ని పెంచితే ఇక వ్యాక్సిన్లు కొరతను కూడా అధిగమించే అవకాశం ఉంది అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి