ఇటీవలి కాలంలో టెలికాం రంగ సంస్థలు అన్నీ కూడా భారీగా టారిఫ్ చార్జీలు పెంచి అందరికీ కూడా షాక్ ఇస్తున్నాయ్.  మొన్నటి వరకు అతి తక్కువ ధరలకే సేవలు అందించిన టెలికాం రంగ సంస్థలు ఇప్పుడు మాత్రం రానురాను చార్జీలను భారీగా పెంచుతున్నాయి  అయితే ప్రస్తుతం టెలికాం రంగంలో టాప్ లో కొనసాగుతుంది భారతీ ఎయిర్టెల్ సంస్థ. రోజురోజుకు తమ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటూ దూసుకుపోతుంది. అయితే గత కొంత కాలం నుంచి అటు ఎయిర్టెల్ కూడా వరుసగా ఛార్జీలను పెంచుతూ షాక్ ఇస్తోంది. ఇక ఇటీవల మరోసారి ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


 గతంలో మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పటికే ఇన్కమింగ్ మెసేజెస్ కాల్స్ పూర్తిగా ఉచితం గా ఉండేవీ. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ అయిపోయిన ప్పటికీ  కాల్స్  వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇన్కమింగ్ కాల్స్ కి కూడా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుం.ది ఇక ప్రస్తుతం ఎయిర్టెల్ లో 49 రూపాయలతో  ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇకపోతే ఇటీవలే ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ లో భారీ మార్పులు చేసింది.



 ముఖ్యంగా కనీస నెలవారి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అయినా 49 రూపాయలను పూర్తిగా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక 49 రూపాయలు రీఛార్జ్ ప్లాన్ ని కాస్త ఏకంగా 79 రూపాయలకు పెంచింది భారతీ ఎయిర్టెల్. అంతేకాదు తమ కస్టమర్లు అందరూ కూడా ఇది గమనించాలి అంటూ సూచించింది  ఇక నుంచి కనీసం నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ అయినా 49 రూపాయలు రీఛార్జ్ చేసుకునేందుకు వీలు లేదు. ఇక 79 రూపాయలతో రీఛార్జ్ చేయిస్తే సెకనుకు ఒక పైసా.. అరవై నాలుగు రూపాయల బాలన్స్ వస్తుంది.అంతే కాకుండా రెండు వందల mb డాటా కూడా వస్తుంది. ఇక ఈ ప్లాన్ జూలై 29 వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: