ఆయుధాలు చేపట్టి ఎన్నో అరాచకాలు సృష్టించి ప్రజలను చిత్రహింసలకు గురిచేసి ఆప్ఘనిస్థాన్లో ఆధిపత్యం సాధించారూ తాళిబన్లు  . ఓ వైపు ప్రభుత్వం లొంగిపోవడం మరోవైపు అమెరికా సైన్యం సైతం ఆఫ్ఘనిస్తాన్ వదిలి పోవడంతో ఇక తాలిబన్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఇక తాలిబన్లు మళ్లీ ఎలాంటి అరాచకాలు సృష్టిస్తారో అని అటు అంతర్జాతీయ సమాజం మొత్తం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తుంది.



 ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు అటు పంజ్ షేర్ ప్రాంతం మాత్రం కంట్లో నలుసులా మారిపోయింది అని చెప్పాలి. పంజ్ షేర్ ప్రాంతంలోని తిరుగుబాటుదారులు తాము తాలిబన్లకు తలొగ్గిపోయేది లేదు అంటూ స్పష్టం చేశారు. తాలిబన్ల పైన యుద్ధానికి  సిద్ధంగా ఉన్నామని కానీ బానిసలుగా మారేందుకు మాత్రం అసలు  సిద్ధంగా లేము అంటూ ఇప్పటికే తిరుగుబాటుదారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు తాలిబన్లు పంజ్ షేర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడులు కూడా చేశారు. కానీ అటు తాలిబన్ లకు తిరుగుబాటుదారులు దీటైన సమాధానం ఇస్తూ వచ్చారు.



 ఇకపోతే ఇటీవలే పంజ్ షేర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆల్ ఖైదా తీవ్రవాదుల సహాయం అడిగారు తాలిబన్లు. ఈ క్రమంలోనే తీవ్రవాదుల సహాయంతో పంజ్ షేర్ ప్రాంతం పై దాడికి పాల్పడ్డారు.  ఇక ఇటీవలే ఏకంగా పంజ్ షేర్ ప్రాంతం పై పట్టు సాధించామని తాలిబన్ ఫైటర్లు గత రాత్రి  సంబరాల్లో మునిగిపోయారు.  ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. అయితే ఇలా తాలిబన్ల సంబరాలు ఏకంగా ప్రాణం మీదికి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోగా 41 మంది గాయపడ్డారు. ఇక మొత్తంగా ఏకంగా తాలిబన్లు తిరుగుబాటుదారుల చెందిన 300 మంది చనిపోయారని టోలో న్యూస్ కూడా తెలిపింది.  మరోవైపు తాము తాలిబన్లకు లొంగి పోలేదని అలాంటి ప్రసక్తే లేదు అంటూ తిరుగుబాటుదారులు చెబుతున్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి: