అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ డాక్టర్ ఇలా ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ఘటన ఛత్తీస్ఘడ్ లో వెలుగులోకి వచ్చింది. సూర్గుజా జిల్లా నర్మదా పురం ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 27వ తేదీ మెగా స్టెరిలైజేషన్ క్యాంపు నిర్వహించారు. ఇక ఈ క్యాంపులో ఏకంగా ఒక వైద్యుడు 101 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాడు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే నిబంధనల ప్రకారం చూసుకుంటే ఒక వైద్యుడు రోజుకి కేవలం ముప్పై కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు మాత్రమే చేయాలి కానీ ఇక్కడ ఒక వైద్యుడు మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 101 మందికి సర్జరీ చేశాడు
ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డాక్టర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కనీసం మహిళల ఆరోగ్యం కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా శస్త్రచికిత్సలు చేస్తారా అంటూ ప్రస్తుతం ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైద్యుడి తీరుపై విమర్శలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఏకంగా త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై వైద్యులు కమిటీకి ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి