ఏం జరిగి ఉంటుందన్న విషయం ఎక్కడ ఉన్న వారికి ఎవరికీ అర్థం కాలేదు.. ఇక ఆ తర్వాత మళ్ళీ ముందుకు కదిలిన రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు అందరూ అవాక్కయ్యారు. అయితే ఇలా ట్రైన్ ఆగడానికి ఎవరూ చైనా లాగలేదు కేవలం ఒక మహిళ రిక్వెస్ట్ చేసింది. ఇలా ఒక మహిళ అడిగిందని ఏకంగా ట్రైన్ ఆపేసిన ఘటన విశాఖ రైల్వే స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఉదయం సమయంలో సికింద్రాబాద్ భువనేశ్వర్ ప్రత్యేక రైలు విశాఖ రైల్వేస్టేషన్లో వచ్చి ఆగింది. ఈ క్రమంలోనే బ్రేక్ టైం పూర్తి కావడంతో ఇక రైల్ స్టేషన్ దాటి పోతున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది.
ఇక కారణం ఏంటి అని ఆరా తీయగా.. రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఏకంగా గార్డు వద్దకు పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. తమ వాళ్ళు స్టేషన్ బయట ఉండిపోయారని కొద్ది సమయంపాటు రైలు ఆపితే వాళ్లు కూడా రైలు ఎక్కుతారు అంటూ చెప్పింది. అయితే దీంతో ఇక స్టేషన్ నుంచి కదిలిన రైలును గార్డు ఆపారు. ఐదు నిమిషాలు వేచి చూసిన వాళ్లు రాకపోవడంతో మళ్ళీ ట్రైన్ కదిలింది. ఇక ఈ లోపు మళ్ళీ పరుగులు పెట్టుకుంటూ వచ్చిన మహిళ అదిగో చూడండి వంతెనపై నుండి వస్తున్నారు కాసేపు ఆపండి అంటూ మరోసారి రిక్వెస్ట్ చేసింది దీంతో మళ్లీ రైలు ఆగిపోయింది. ఇక ఆ మహిళ వారిని తీసుకొచ్చి రైలు ఎక్కించటం తో ఇక రైలు కదిలింది. ఇలా రెండుసార్లు రైలు ఆగిపోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి