అంతేకాకుండా అన్ని విధాలుగా మహిళల పై నిషేధం విధిస్తూ కేవలం మహిళలను సెక్స్ బానిసలుగా మాత్రమే మార్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో తాలిబన్ల పాలనలో తొలగిపోవడంతో మహిళలకు విముక్తి లభించింది. ఇక ఇప్పుడు మళ్లీ తాలిబన్ లు ఆధిపత్యం లోకి వచ్చారు. అయితే ఈసారి మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని.. ప్రభుత్వంలో కూడా అవకాశం కల్పిస్తామని అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాస్తవానికి మాత్రం మహిళలపై క్రమక్రమంగా తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. పైపైకి ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ వాస్తవంగా మాత్రం మహిళలను బానిసలుగా మార్చుకుంటున్నారు.
ఇక ఇటీవలే మహిళల పట్ల ఆఫ్ఘనిస్థాన్లో క్రీడల పట్ల తాలిబన్ మంత్రి బషీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షరియా చట్టాలకు అనుగుణంగా ఉన్నంతవరకు ఏ క్రీడపై కూడా నిషేధాజ్ఞలు విధించము అంటూ తాలిబన్ మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఏకంగా 400 రకాల ఆటల కు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు బషీర్ అహ్మద్. ఈ క్రమంలోనే క్రీడల్లో మహిళలు పాల్గొనే అంశంపై అటు మీడియా పలు ప్రశ్నలు అడుగగా.. దయచేసి మహిళల గురించి మాత్రం అస్సలు అడగకండి అంటూ సమాధానం చెప్పడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇక అంతకు ముందు మహిళలు ఆటలు ఆడటం అవసరం లేదు అంటూ తాలిబన్ల లోని కీలక నేత వ్యాఖ్యానించడం సంచలనం గా మారిన విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి