కరోనా వైరస్ కష్ట కాలంలో ప్రజల అవస్థలను అర్థం చేసుకుని అడుగడుగునా అండగా నిలుస్తూ ప్రత్యక్ష దైవం గా మారిపోయింది ఎవరు అంటే ప్రతి ఒక్కరూ చెప్పే పేరు సోను సూద్.  ఆయన ఒక సినీ నటుడు..  ఎన్నో సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించాడు. విలాసవంతమైన జీవితం..  రాజకీయాల్లోకి రావాలి అనే  ఆశ లేదు..  ప్రజల గురించి ఆలోచించే తీరిక కూడా లేదు.  ఇక సినిమాల్లో విలన్ పాత్రలు చేసుకుంటూ అటు జనాల్లో ఆయనకు కాస్త నెగటివ్ ఇంప్రెషన్ ఉంది అని చెప్పాలి.  కానీ అలాంటి వ్యక్తి కరోనా వైరస్  కష్ట కాలంలో ప్రజల్లోకి వచ్చారు. వలస కార్మికులు అందరూ అవస్థలు పడుతూ ప్రాణాలు కోల్పోతున్న సమయంలో నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు సైతం చేయలేనిది సోను సూద్ చేసి చూపించారు.  ఒకవేళ సోను సూద్ అనేవాడు లేకపోతే మేము కరోనా కష్ట కాలంలో ఏం అయ్యే వాళ్లమో అని ప్రతి ఒక్క వలస కార్మికులు అనుకునేలా సోను సూద్ సహాయ సహకారాలు అందించాడు.  కేవలం  వైరస్ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు సహాయం చేశాడు. ఇక ఇలా సహాయం చేయడానికి ఆస్తులు సైతం తాకట్టు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయ్.
 అయితే అలాంటి సోనుసూద్ ఆఫీసులో ఇటీవలే ఓ ఐటీ రైడ్ జరగడం సంచలనంగా మారిపోయింది. దీంతో కొంతమంది పార్టీల నేతలు  విమర్శలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మహాన్దళ్  పార్టీ నేత సంచలన ఆరోపణలు చేశారు. కరోనా లాక్ టోన్ సమయంలో ప్రజలను తరలించేందుకు సోనూసూద్ పంపిన బస్సుల ద్వారానే  వైరస్ వ్యాప్తి చెందింది అంటూ కేశవ దేవ్ మౌర్య వ్యాఖ్యానించడం సంచలనం గా మారిపోయింది  ప్రస్తుతం సోనూసూద్ ఆస్తులపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.. ఇకపై సోనూ కూడా బిజెపి ప్రచారం చేయాల్సిందే కేశవ దేవ్ మౌర్య చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: