ఎంతో బుద్ధిగా చదువుకుంటున్న యువతను పెడదారి పట్టిస్తున్నాయి మాదక ద్రవ్యాలు . ఇక చదువు అనే పదాన్ని దూరం చేసి నేరాలకు పాల్పడేలా చేస్తున్నాయ్ డ్రగ్స్. నేటి రోజుల్లో యువత గంజాయి డ్రగ్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మొన్నటివరకు డ్రగ్స్ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే మూల కేంద్రంగా ఉండేది. హైదరాబాద్ లోని ఎన్నో కాలేజీలో ఇలా డ్రగ్స్ దందా  ఘటనలు కూడా ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి.  ఎంతో మంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు  కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ గాళ్ళు మకాం మార్చినట్లు తెలుస్తోంది.



 ఎందుకంటే ఇటీవలే హైదరాబాద్ కంటే ఎక్కువగా అటు విజయవాడలో డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటికే విజయవాడలో గంజాయి కి బానిసలుగా మారుతూ యువత  జీవితాలను నాశనం చేసుకుంటున్నారు  అన్నది అందరూ అనుకుంటున్న మాట.  విజయవాడలో ఉన్న ప్రధాన కాలేజీలో టార్గెట్గా గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది అనే  అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇటీవలే ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న ఏకంగా తొమ్మిది వేల కోట్ల హెరాయిన్ పట్టుబడటం సంచలనంగా మారిపోయింది.


 మామూలుగా అయితే హైదరాబాద్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం చూశాము. కానీ విజయవాడలో కూడా తొమ్మిది వేల కోట్ల హెరాయిన్ డ్రగ్స్ పట్టుకోవడం మాత్రం సంచలనంగా మారిపోయింది. దీన్ని బట్టి చూస్తే గంజాయ్ మాత్రమే కాదు డ్రగ్స్ కూడా ప్రస్తుతం విజయవాడలో రాజ్యమేలుతుంది అన్నది అర్ధమవుతుంది. టాల్కమ్ పౌడర్ పేరిట కంటెయినర్లలో తరలిస్తున్న హెరాయిన్ ను గుజరాత్ పోలీసులు సీజ్ చేశారు. అధికారులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిలో ఇద్దరు ఆప్ఘనిస్తాన్ జాతీయులు ఉండడం గమనార్హం. అయితే విజయవాడకు చెందిన ఒక కంపెనీ వీటిని బుక్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు


 అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడటంతో ఇప్పుడు ఎన్నో అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్ తో అటు విజయవాడకు కూడా లింకులు ఉన్నాయా? హైదరాబాద్ నుంచి డ్రగ్స్ దందా విజయవాడకు మారిందా? అసలు ఎన్ని రోజుల నుంచి విజయవాడ లో ఇలాంటివి నడుస్తున్నాయ్? ఇక్కడ ఎవరి ప్రమేయంతో ఇదంతా జరుగుతుంది? అన్న విషయంపై కూడా నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. అయితే ఒక్కసారిగా భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడంతో అటు బెజవాడ లోని ప్రముఖ కాలేజీ లు అన్నీ కూడా అలర్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: