మొన్నటి వరకు అగ్ర రాజ్యమైన అమెరికా లో కరోనా వైరస్ ఎంతటి అల్లకల్లోల పరిస్థితుల సృష్టించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు  ప్రపంచం లోని అన్ని దేశాలకంటే అటు అమెరికా లోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఇక మరణాల సంఖ్య కూడా అగ్రరాజ్యం లోనే ఎక్కువ కావడం గమనార్హం.  అయితే అమెరికా లో కరోనా వైరస్ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దు మణుగుతున్నాయని  అందరూ ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో ఇటీవలే హవానా సిండ్రోమ్ అక్కడ కలవర పెడుతోంది. ఇప్పటికే ఎంతో మంది హవానా సిండ్రోమ్ బారిన పడుతున్నారు.



 అమెరికాకు చెందిన ఎంతో మంది దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది పై మైక్రోవేవ్, రేడియో వేవ్ దాడులు జరుగుతున్నట్లు ప్రస్తుతం అమెరికా శాస్త్రవేత్తలు అందరూ రోజురోజుకి భయాందోళనలో మునిగిపోతున్నారు. ఇక ఇటీవలే హవానా సిండ్రోమ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నాయ్. ఇక ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయం పై దర్యాప్తు చేపట్టినప్పటికి కనుగొనలేకపోయారు అధికారులు. ఈ క్రమంలోనే రోజురోజుకు హవానా సిండ్రోమ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.


 అయితే ఇప్పటి వరకు దాదాపు 200 మంది యూఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు కూడా హవానా సిండ్రోమ్ తో బాధ పడుతున్నారట. ఈ సిండ్రోమ్ బారిన పడితే వికారం మైకం మైక్రాన్లు మరియు జ్ఞాపకశక్తి లోపాలతో సహా మరిన్ని రుగ్మతలు కూడా వస్తాయి అని చెబుతున్నారు. 2016లో క్యూబాలోని యూఎస్ ఎంబసీ లో ఉన్న అధికారులు మొదట దీనిని గుర్తించారు  ఇక ఇటీవల యునైటెడ్ స్టేట్స్ నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి ఈ నెలలో భారతదేశానికి ప్రయాణిస్తున్నప్పుడు హవానా సిండ్రోమ్ కి సంబంధించిన లక్షణాలను కలిగి ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: