అయితే సరిహద్దుల్లో అటు వివాదం కాస్త సద్దుమణిగింది అట్లుఅన్నట్లు అనిపించినప్పటికీ చైనా ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంతే కాకుండా చిత్ర విచిత్రమైన స్టేట్ మెంట్లతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల మరోసారి చైనా తీరు భారత్ కి ఆగ్రహాన్ని తెప్పించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడానికి భారత్ వైఖరి కారణం అంటూ చైనా ఇటీవలే వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక చైనా స్టేట్ మెంట్ పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టింది.
తూర్పు లడక్ సరిహద్దుల్లో వివాదానికి చైనా అనే బాధ్యత వహించాలని ఇటీవల భారత్ చైనా కు కౌంటర్ ఇచ్చింది. రెచ్చగొట్టే ప్రవర్తనతో యథాస్థితిని మార్చడానికి చైనా సైన్యం ఏకపక్షంగా ప్రయత్నించడం కారణంగానే సరిహద్దుల్లో శాంతి భద్రతకు విఘాతం ఏర్పడింది అంటూ భారత్ చైనా తీరుపై మండిపడింది. నిరంతరం చైనా సరిహద్దుల్లో భారీగా బలగాలను ఆయుధాలను మొహరిస్తుందని ఇక ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు భారత్ కారణమంటూ చెబుతుంది అంటూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాక్సి అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి