కానీ ఇప్పటికీ అమెరికాకు చెందిన కొంత మంది పౌరులు బ్రిటన్కు చెందిన కొంత మంది పౌరులు.. ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది కూడా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లోనే చిక్కుకు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కులో అటు తాలిబన్లు పాలన మొదలు పెట్టిన నాటి నుంచి ఇక అన్ని దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్కు విమానాలను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసున్నాయి. ఒక పాకిస్తాన్ మినహా ఏ దేశం కూడా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు విమానాలు నడపడం లేదు. అయితే ఇప్పటికీ పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ కు మద్దతు ఇస్తుంది అనే విషయం తెలిసిందే.
అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కుపోయిన బ్రిటన్, అమెరికా పౌరులతో పాటు ఐక్యరాజ్యసమితి సిబ్బందిని కూడా విడిపించేందుకు ఇక వారి వారి స్వదేశాలకు రప్పించేందుకు చర్చలు జరపడానికి అమెరికా, బ్రిటన్ దేశాలు సిద్ధమవుతున్నాయి అన్నది అర్ధమవుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించేందుకు రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. తాలిబన్లతో మాట్లాడి మీ దేశపౌరుల మీకు అప్పజెప్పేలా నేను మధ్యవర్తిత్వం చేస్తాను అంటూ పాకిస్తాన్ ముందుకు రావడంతో... ఎవరి జోక్యం అవసరం లేదని తాలిబన్లతో తామే స్వయంగా మాట్లాడుకుంటాము అంటూ అమెరికా పాకిస్థాన్ కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమెరికా స్టేట్మెంట్తో పాకిస్తాన్ దిగ్భ్రాంతికి గురి అయింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి