వరదల వల్ల నష్టపోయిన వారి  కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలని ఆదేశించారు జగన్.  వరదల నేపథ్యంలో మరణించిన పశువుల కళేబరాలవల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోండని.. పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టండన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోండి..  పంటల నష్టం ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టండని పేర్కొన్నారు జగన్. విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయండని.. చెరువులు, ఇతర జలాశయాలు, గట్టుమీద దృష్టిపెట్టండని పేర్కొన్నారు జగన్..

నిరంతరం అప్పమత్తంగా ఉండండని..  ఎప్పటికప్పుడు వారు నివేదికలను అధికారులకు అందించాలని తెలిపారు. బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తున్నారని..  అయినా సరే చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు జగన్.ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండండి..  కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు  సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నామని స్పష్టం చేశారు జగన్. అధికారులు అంతా డైనమిక్‌గా పనిచేయాలని.. ఎలాంటి సమస్య ఉన్నా.. నా దృష్టికి తీసుకు రండన్నారు జగన్. 

విద్యుత్‌ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని.. సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోండని పేర్కొన్నారు జగన్. వరద ముంపును పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా సంబంధించి సబ్‌స్టేషన్లను, కరెంటు సరఫరా వ్యవస్థను ముంపు లేని ప్రాంతాలకు తరలించాలన్నారు జగన్. పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశామని.. పశువులు మరణిసే.. .నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోండన్నారు జగన్. గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని.. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలన్నారు.  ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా..వారికి వెంటనే నగదు ఇవ్వండి.. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వండన్నారు సిఎం జగన్.  దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరుచేయండన్నారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: