ఢిల్లీః శుక్రవారం ( నవంబరు 26 వ తేదీ) మరోసారి పియూష్ గోయ ల్ తో భే టీ కాను న్నారు తెలంగా ణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్.పిలు, రాష్ట్ర అధికారులు. పియూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ రో జు గంట 23 నిమిషాలపాటు సమావేశం సాగింది.
 రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి సేకరించాలని ఈ సంద ర్భంగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ను కోరింది టిఆర్ఎస్ పార్టీ నేతల బృందం.   రైతులు ఏ పంట వేయాలో  కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చే శారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు.  కొంత మేరకు తెలంగాణ నుంచి కొనుగోలు చేసే కోటాను పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు చెప్పారు తెలం గాణ రాష్ట్ర నేతలు.  


ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం ప్రకటన చేయాలని కోరింది తెలంగాణ నేతల బృందం.   కేం ద్రం ప్రకటన చేసిన తర్వాత, రాష్ట్రం  రైతులను ఒప్పిస్తుందని పియూష్ గోయల్ కు తెలిపింది తెలంగాణ మంత్రులు, నేతల బృందం. ఈ తెలంగాణ మంత్రుల బృందం లో మంత్రులు కేటీఆర్, గంగుల‌, నిరంజ‌న్ రెడ్డి, తెలంగాణ సీఎస్ సోమేశ్‌ కుమార్‌ లతో పాటు తెలంగాణ వ్యవసాయ అధికారులు ఉండటం గమనార్హం. అయితే... ఇవాళ జరిగిన సమావేశం లో ధాన్యం కొనుగోలు అంశంపై స్పష్టత మాత్రం రాలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు సమావేశ వివరాలను  తెలియ జేయనుం ది కేటిఆర్ బృందం. కాగా.. గత కొన్ని  రోజుల నుంచి తెలంగాణ స్టేట్ లో ధాన్యం కొనుగోలు అంశం  పై కేసీఆర్ సర్కార్ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య పంచాయితీ కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: