ముందంతా ఊహించారు అత‌డొక
సింహ‌స్వ‌ప్నం  కాగ‌లడ‌ని
ముందంతా అనుకున్నారు అత‌డొక
సైన్యం నిర్మించ‌గ‌లడ‌ని
కానీ ఇప్పుడు
అదంతా అబ‌ద్ధం అని తేలిపోయింది  
అత‌ని నిజాయితీని కూడా సంకించాల్సి వ‌స్తోంది
ఇదండీ ఇవాళ రేవంత్ పై ఉన్న విమ‌ర్శరాహుల్ గాంధీ పాద‌యాత్ర చేప‌ట్టినా లేదా రంగంలోకి నేరుగా అధినేత్రి సోనియా దిగి, పార్టీ పనులు ద‌గ్గ‌రుండి చ‌క్క‌బెట్టినా గాంధీభవ‌న్ రాజ‌కీయాలు ఇప్ప‌టికిప్పుడు మారవు. ఎందుకంటే అక్క‌డ ఉన్న‌వారికీ, రేవంత్ కూ ఉన్న భేదాలే ఓ కార‌ణం. మొద‌ట్నుంచీ కాంగ్రెస్ హై క‌మాండ్ కుర్రాడు బానే ప‌నిచేస్తాడు అని రేవంత్ గురించి అనుకున్నా, పార్టీని న‌డిపే గురుతర బాధ్య‌త‌లు అప్ప‌గించాక ఆయ‌న న‌డ‌వ‌డి ఏంట‌న్న‌ది తేలిపోయింది. ఆయన అటు కేసీఆర్ కు ఇటు చంద్ర‌బాబుకు అనుగుణంగా రాజ‌కీయం చేయడంలో దిట్ట.


అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లో ఉన్న క్ర‌మశిక్ష‌ణా రాహిత్యంతో ఉన్న నేత‌లను దారికి తేలేని నేత..అని ఇంకొంద‌రు చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ క్షేత్ర స్థాయిలో ప‌ట్టున్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకోక పోగా, పార్టీ అసంతృప్త‌వాదుల‌కు ఆయ‌నొక అస్త్రంగా మారిపోయారు. అందుకే ఆయ‌న‌ను టార్గెట్ గా చేసుకుని రాజ‌కీయం చేయాల‌నుకుంటు న్న వారికి (అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెసుకు కానీ)  కావాల్సినంత స్ట‌ఫ్ దొరుకుతోంది. కేసీఆర్ కు దీటుగా ఎదిగే నేత అయితే రేవంత్ కాదు. కేసీఆర్ ఎందుకు కానీ కేటీఆర్ ను కూడా తాక‌లేని బ‌ల‌హీన శ‌క్తిగా ఇవాళ రేవంత్ వ‌ర్గం త‌యారైంది అని ఓ వర్గం అదే ప‌నిగా విమ‌ర్శిస్తోంది. సో మాకు పార్టీ ప‌దవులే ముఖ్యం పార్టీ బాగు క‌న్నా అనే నేత‌ల‌కు బుజ్జ‌గింపులు చేయ‌డం అన్న‌ది ఎప్పుడో మానుకున్న రేవంత్ కు అస‌లు త‌త్వం అందులో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల మ‌న‌స్త‌త్వం బోధ‌ప‌డ‌క‌పోవ‌డం విడ్డూరం. మ‌హా స‌ముద్రంలో దూకి ఈత రాదు అని అంటే ఎలా రేవంత్?

ఇప్ప‌టిదాకా క‌థ వెరీ రొటీన్ గా ఉంది. ఇప్ప‌టి నుంచి క‌థ కూడా అలానే ఉండ‌నుంది. ఉండ‌బోతోంది. కార‌ణం రేవంత్. తెలంగాణ కాంగ్రెస్ క‌థ ను మ‌లుపు తిప్పే శ‌క్తి, మ‌లుపు తిప్పాక మీసం మెలేసే శ‌క్తి ఆయ‌న‌కు లేవ‌న్న‌ది సుస్ప‌ష్టం. అయినా కూడా అధినాయ‌క‌త్వం ఆయ‌న‌నే న‌మ్ముతోంది. ఆయ‌న‌తోనే తెలంగాణ వాకిట రాజ‌కీయం చేయ‌డ‌మే కాదు వీలుంటే ఆంధ్రా ప‌రిణామాల‌ను కూడా చూడ‌మ‌ని రేపో మాపో ఆదేశించ‌నుంది అని కూడా ఓ రూమర్ ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతోంది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో! దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు అటు ఆంధ్రా కాంగ్రెస్ కు మంచి రోజులు వ‌చ్చి, పార్టీ ప్ర‌క్షాళ‌న అన్న‌ది అనుకున్నంత వేగంగా అనుకున్నంత స్థాయిలో అనుకున్న స‌మ‌యానికే జ‌రిగిపోతుంది అని కూడా ఎక్కువే ఊహించింది రేవంత్ పై అధి నాయ‌క‌త్వం. కానీ అధినాయ‌క‌త్వం ఊహ‌లు కానీ ఆశ‌లు కానీ నెర‌వేరేందుకు ఛాన్స్ అన్న‌ది లేనేలేద‌ని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: