ఏపీ రాజకీయాల్లో జగన్ అత్యంత బలమైన నేత...అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన రాజకీయంగా చాలా శక్తివంతుడు. ఏ నాయకుడు కూడా జగన్‌ని ఢీకొట్టే స్థాయిలో లేరు. అలా అని చెప్పి...జగన్ జనంలోకి రాకపోతే ఎప్పటికైనా ఇబ్బందయ్యే పరిస్తితి ఉంది. ఇప్పటివరకు వైసీపీ అద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. జగన్ కాలు బయటపెట్టకుండానే...వైసీపీ అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంది. ఆఖరికి తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో సైతం జగన్ ప్రచారానికి వెళ్లలేదు.

కానీ అపోజిషన్ లీడర్ చంద్రబాబు మాత్రం...చిన్నాచితక ఎన్నికలకు కూడా ప్రచారం చేశారు. అలాగే తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో మున్సిపాలిటీని గెలిపించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. కానీ బాబు ప్రయత్నాలు ఎక్కడా వర్కౌట్ కాలేదు. వైసీపీ వన్‌సైడ్‌గా విజయాలు సాధించింది. అయితే జగన్ కాలు పెట్టకుండానే వైసీపీకి ఇలాంటి విజయాలు వచ్చాయంటే...మామూలు విషయం కాదనే చెప్పాలి. జగన్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం తగ్గలేదని తెలుస్తోంది.

కాకపోతే అదే నమ్మకంతో ముందుకెళితే...భవిష్యత్‌లో బోల్తా కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా...రానున్న రోజుల్లో జగన్ అడుగు బయటపెట్టకుండా, జనంలోకి రాకుండా రాజకీయం చేస్తే ఇబ్బంది పడక తప్పదు. ఇప్పటికే కొంతవరకు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నట్లు కనిపిస్తోంది. అలా అని టీడీపీ పుంజుకోలేదు. కానీ కాస్త ఛాన్స్ దొరికితే అదే జరుగుతుంది.

ఇప్పటికే పలు అంశాల్లో జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. పెరిగిన ధరలు, పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇటు కొన్ని నిర్ణయాల్లో జగన్ మడమ తిప్పుతున్నారు. ఆ విషయాలు స్పష్టంగా అర్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో ఇంకా జగన్..బయటకు రాకపోతే పార్టీకే ఇబ్బంది అవుతుంది. ఇకనైనా జగన్ జనంలోకి రావాల్సి ఉంది. అటు పక్క రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సైతం బయటకు రావాల్సిన పరిస్తితి వచ్చింది. కాబట్టి జగన్ ఇక ఎంట్రీ ఇస్తేనే వైసీపీకి ప్లస్.  

మరింత సమాచారం తెలుసుకోండి: