ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి లాంటివి ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన డాక్యుమెంట్లు గా మారిపోయాయి అని చెప్పాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక పౌరుడు కూడా ఈ డాక్యుమెంట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ లేవు అంటే ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం ఇవి లేవు అంటే చాలు ఎన్నో రకాల పనులు ఆగిపోతాయి అని చెప్పాలి. దీనికి సంబంధించిన లావాదేవీలు నుంచి ప్రభుత్వ పథకాల వరకు కూడా కీలకమైన డాక్యుమెంట్ల తోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఇక ఈ డాక్యుమెంట్లను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని.. అంతే కాదు ఎంతో జాగ్రత్తగా వివరాలను పొందుపరుస్తూ కోవాలి అంటూ సూచిస్తూ ఉంటారు అధికారులు.


 అయితే ఒక వ్యక్తి బతికున్నప్పుడు ఇలాంటి డాక్యుమెంట్లు అవసరం అదే వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్లు ఏమవుతాయి అన్నది మాత్రం చాలా మందికి తెలియని ప్రశ్న. ఒక వ్యక్తి మరణించిన తర్వాత పాస్పోర్టు పాన్ కార్డు లాంటివి కుటుంబ సభ్యులు ఎంతో భద్రంగా ఉంచాలి లేదంటే వేరే వాళ్ళు వీటితో అక్రమాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే పాస్పోర్ట్ కాలపరిమితి పునరుద్ధరించక పోతే మాత్రం పాస్పోర్ట్ పనిచేయకుండా పోతుంది.


 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుతం ఓటరు గుర్తింపు కార్డు వస్తోంది.. ప్రస్తుతం ప్రతి మనిషి జీవితంలో ఇది కూడా ఒక ముఖ్యమైన పత్రం. ఈ కార్డు ద్వారా ఎన్నికల్లో ఓటు వేయవచ్చు అయితే ఇలా ఒక వ్యక్తి మరణించిన తర్వాత దానిని రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎన్నికల కార్యాలయానికి ఫారం సెవెంత్-7 ఇస్తే సరిపోతుంది. ఇక ఈ ఓటర్ ఐడి కార్డు రద్దు అవుతుంది..


 పాన్ కార్డు నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ జీవితంలో ఎంతో కీలకంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఎలాంటి ఆర్థిక సంబంధ లావాదేవీలు జరపాలి అన్న కూడా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత పాన్ కార్డును సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కూడా ఎంతో సురక్షితంగా పెట్టుకోవడం మంచిది. ఆ తర్వాత ఈ పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖకు అందజేయాలి ఒకవేళ మరణించిన వ్యక్తి యొక్క పాన్ కార్డు భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తే మాత్రం ఆ పాన్ కార్డును మీతోనే ఉంచుకోవడం ఎంతో మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: