తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు అటు తెలంగాణ రాజకీయాలను ఎప్పుడు హాట్ హాట్ గా మారుతున్నాయి. గత కొంత కాలం నుంచి మున్సిపల్  ఎన్నిక లు, ఉప ఎన్నికలు  వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ను టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని స్థానాల్లో విజయం మాదే అంటూ చెప్పింది. టిఆర్ఎస్ కు పోటీ లేదు ఇక ఏకపక్షంగా ఎన్నుకోవడం అనే విధంగానే వ్యవహరించింది.



 కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు రేవంత్ రెడ్డి ఏకంగా కేసీఆర్కు షాక్ ఇచ్చారు అని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతో దూకుడు గానే ముందుకు సాగుతున్నారు. తనదైన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నారు. ఇక అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అసలుసిసలైన ప్రతిపక్షం మేమే అని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కేసిఆర్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఇక రేవంత్ రెడ్డి ఇంకెక్కడ షాక్ ఇచ్చాడు అని అనుకుంటున్నారు కదా.


 అయితే అన్ని స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం మెజారిటీ సాధించలేకపోయింది. ఊహించినదానికంటే ఓట్లు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. పోటీ లేదు ఏకపక్ష విజయం అనుకున్న చోట అభ్యర్థులు నిలబెట్టింది కాంగ్రెస్. మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ  అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేశారు.  మెదక్ జిల్లా కాంగ్రెస్కు ఉన్న ఓట్లు 175. కానీ వచ్చిన ఓట్లు మాత్రం 235. దీంతో ఇక ఈ ఎక్కువ ఓట్లు వేసిన వారు ఎవరు టిఆర్ఎస్ నుంచి అసంతృప్తి ఉన్నవారేనా అని ఒక భావన తెరమీదికి వచ్చింది. అచ్చం ఇలాగే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి 116 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి 247 ఓట్లు వచ్చాయి. ఇంత మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయంటే  టిఆర్ఎస్ పై అసంతృప్తి ఉన్న వారు చాలా మంది ఉన్నారు  అని ఒక భావన తెరమీదికి వచ్చింది. ఇలా కేసీఆర్ కు రేవంత్ షాక్ ఇచ్చారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: