ఈ నిర్ణయం కాస్త ఎంతో సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఆడపిల్లల పెళ్లి కి కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు గా మారుతుందని నిర్ణయం తీసుకోవడంతో మహిళా లోకం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. 21 సంవత్సరాల లోపు ఆడపిల్లలు కనీసం చదువు పూర్తి చేయడానికైనా సమయం ఉంటుందని ఎంతో మంది ఆడపిల్లలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ 21 సంవత్సరాల వివాహ వయస్సు ను నిర్ణయిస్తూ చట్టంలో మార్పులు తీసుకురావడాన్ని ఎంతో మంది వ్యతిరేకిస్తూ ఉండడం గమనార్హం.
కమ్యూనిస్టు సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు కూడా ఇక ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఓవైసీ రంగంలోకి దిగి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 18 ఏళ్ళ వయస్సు లో ప్రధానమంత్రిని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు.. 21 ఏళ్ళ దాకా అమ్మాయికి పెళ్లి హక్కు లేకపోవడం ఏంటి అంటూ ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెళ్లి కంటే ప్రధాన మంత్రి ని ఎన్నుకోవడం ఎంతో గొప్ప విషయం కదా అలాంటప్పుడు 18 సంవత్సరాల వయసులోనే అమ్మాయికి ఓటు హక్కు ఎందుకు అంటూ ప్రశ్నించారు ఓవైసీ. అంతే కాకుండా మరో వైపు కొన్ని మహిళా సంఘాలు కూడా తిరువనంతపురంలో చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు దిగినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి